న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎండ వేడిమికి తాళలేక: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆటగాళ్ల పరిస్థితి ఇదీ

By Nageshwara Rao
Australian Open 2018: Melbourne's extreme heat bites as mercury topped 40 degrees

హైదరాబాద్: ఆస్ట్రేలియాలో సమ్మర్ కావడంతో సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ భగ్గుమంటోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగే మెల్‌బోర్న్‌లో ఆటగాళ్లు ఎండ వేడిమికి తట్టుకోలేక అపసోపాలు పడుతున్నారు. ఎండ 40 డిగ్రీలకు చేరడంతో కోర్టులో ఎక్కువసేపు నిలవడం క్రీడాకారులకు కష్టమవుతోంది.

నాలుగో రోజైన గురువారం క్రీడాకారులు ఎండ వేడిమికి తెగ ఇబ్బంది పడ్డారు. దాదాపు అందరు క్రీడాకారులు ఐస్‌తో నింపిన బట్టను తలకు, శరీరానికి అద్దుకుంటూ ఆటను కొనసాగించారు. ఇక, సుదీర్ఘంగా సాగే మ్యాచ్‌లకైతే చెప్పాల్సిన పనిలేదు. ఎక్కువ సార్లు నీటి విరామాలు తీసుకోవాల్సిన పరిస్థితి.

ప్రాన్స్‌కు చెందిన క్రీడాకారిణి కరోలినా గర్సియా మాట్లాడుతూ కోర్టులోకి వెళితే మంటల్లో నిలుచున్నట్లు ఉంటుందని చెప్పడం విశేషం. మరోవైపు మ్యాచ్ జరుగుతున్న సమయంలో డొమినిక్‌ థీమ్‌ ఐస్‌ నీళ్ల స్నానం కోసం ఎంతగా పరితపించి పోయాడో మ్యాచ్ చూసిన వారికి తెలుస్తుంది.

ఇక, స్పెయిన్‌కు చెందిన ముగురుజా మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ 'కోర్టులో భరించలేని వేడి ఉంది. గతంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో ఎన్నో కఠినమైన మ్యాచ్‌లు ఆడాను. కానీ ఈ రోజు మాత్రం వేడిని తట్టుకోవడం నా వల్ల కాలేదు' అని చెప్పింది.

Story first published: Friday, January 19, 2018, 11:16 [IST]
Other articles published on Jan 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X