హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌లో రఫెల్ నాదల్‌పై స్పెయిన్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ పైచేయి సాధించాడు. టైటిల్ కోసం ఇద్దరి ఆటగాళ్ల మధ్య రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో ఫెదరర్ 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో నాదల్‌పై విజయం సాధించాడు. ఫెదరర్‌కు తన కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం.
ఆదివారం ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను కనువిందు చేసింది. ఆరేళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో తలపడిన వీరిద్దరూ అభిమానులను ఏమాత్రం నిరాశపరచలేదు. పాయింట్, పాయింట్‌కూ.. గేమ్, గేమ్‌కూ.. సెట్ సెట్‌కూ.. ఒకరిపై ఒకరు పైచేయి సాధించారు.
అభిమానులకు అసలు సిసలైన టెన్నిస్ మజాను అందించారు. తొలి సెట్‌ను రోజర్ ఫెదరర్ సొంతం చేసుకున్నాడు. మొదటి సెట్‌లో ఫెదరర్ 6-4 తేడాతో నాదల్‌పై విజయం సాధించాడు. 34 నిమిషాల పాటు సాగిన తొలి సెట్‌లో ఆట ప్రారంభం నుంచి వీరిద్దరూ పోటాపోటీగా ఆడారు.
రండో సెట్‌లో నాదల్ పుంజుకున్నాడు. తొలి సెట్‌ను 4-6తో కోల్పోయిన నాదల్ రెండు సెట్‌ను 6-3తేడాతో సునాయాసంగా గెలుచుకున్నాడు. ఇక మూడో సెట్‌లో రోజర్ 2, నాదల్ 1 సెట్ గెలుచుకున్నారు. దీంతో మూడు సెట్లలో ఫెదరర్ 2-1 తేడాతో నాదల్‌పై ఆధిక్యం సాధించాడు.
ఆ తర్వాత అయిదు సెట్లలో చెరో రెండు సెట్లు గెలుచుకుని సమవుజ్జీలుగా ఉన్నారు. నాలుగు సెట్లలో రోజర్ 6-4, 3-6, 6-1, 3-6 తేడాతో నాదల్ సమంగా నిలిచారు. ఇక నిర్ణయాత్మక అయిదో సెట్‌లో స్విస్ మాస్టరే రఫెల్ నాదల్ పైచేయి సాధించాడు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్‌గా అవతరించాడు.