న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెరెనా విలియమ్స్‌పై వింత కార్టూన్: విమర్శలు, ట్విట్టర్ అకౌంట్ డిలీట్

Australian cartoonist under fire for Serena Williams sketch

హైదరాబాద్: అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌పై ఆస్ట్రేలియాకు చెందిన కార్టూనిస్ట్‌ మార్క్‌ నైట్‌ వేసిన ఓ కార్టూన్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ రచయిత్రి జేకే రోలింగ్‌ ఆ కార్టూన్‌పై తీవ్రంగా మండిపడింది.

<strong>యుఎస్ ఓపెన్ ఫైనల్లో 'సెక్సిజం': అంఫైర్‌ని దొంగ అన్న సెరెనా విలియమ్స్</strong>యుఎస్ ఓపెన్ ఫైనల్లో 'సెక్సిజం': అంఫైర్‌ని దొంగ అన్న సెరెనా విలియమ్స్

ఈ మేరకు తన ట్విట్టర్‌లో "ఈ కార్టూన్‌ జాత్యహంకారం, లింగ వివక్ష"ను సూచిస్తున్నట్టుగా ఉందని కామెంట్ పోస్టు చేసింది. వివరాల్లోకి వెళితే... మెల్‌బోర్న్‌లోని హెరాల్డ్‌ సన్‌ దినపత్రికలో ప్రచురితమైన ఆ కార్టూన్‌లో కండలు తిరిగి, లావు పెదాలతో ఉన్న సెరెనా విరిగిన రాకెట్‌పై చిన్నపిల్లలా మారాం చేస్తూ గెంతుతూ ఉంది.

సెరెనా విలియమ్స్ వ్యవహారశైలిని సూచించేందుకు

సెరెనా విలియమ్స్ వ్యవహారశైలిని సూచించేందుకు కోర్టులో తేనె పీకను కూడా ఆ కార్టూనిస్ట్ గీయడం విశేషం. అదేదో ఆమెనే గెలవనివ్వ కూడదు? అని జపాన్‌‌కు చెందిన తన ప్రత్యర్థి నవోమీ ఒసాకాతో అంఫైర్ చెబుతున్నట్లుగా ఉంది. దీనిపై "ఓ గొప్ప క్రీడాకారిణిని దిగజార్చి ఎంతో గొప్ప పని చేశావ్" అని రోలింగ్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేసింది.

లింగ భేదాన్ని తీసుకురావద్దు అంటూ రిప్లై

లింగ భేదాన్ని తీసుకురావద్దు అంటూ రిప్లై

దీనికి ప్రతిగా స్పందించిన కార్టూనిస్ట్ మార్క్‌ నైట్‌ "ఒక వ్యక్తి ప్రవర్తనా తీరులో లింగ భేదాన్ని తీసుకురావద్దు" అంటూ రిప్లై ఇచ్చాడు. మార్క నైట్‌ గతంలో కూడా అనేక వివాదాస్పద కార్టూన్లు వేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు మార్క్ నైట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సెరెనా విలియమ్స్‌పై చేసిన ట్వీట్లను తొలగించాడు.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

ఆరు సార్లు యుఎస్ ఓపెన్ గెలిచిన సెరెనా విలియమ్స్ ఫైనల్లో వరుస సెట్లలో 6-2, 6-4 తేడాతో ఒసాకా చేతిలో ఓటమిపాలైంది. రెండో సెట్‌లో సెరెనా నిబంధనలు ఉల్లంఘించి ఛైర్‌ అంపైర్‌ ఆగ్రహానికి గురైంది. తొలి సెట్‌ను 6-2 కోల్పోయిన సెరెనా.. రెండో సెట్‌ జరుగుతున్న సమయంలో కోచ్‌ సాయం తీసుకోవడంపై ఛైర్‌ అంపైర్‌ హెచ్చరించాడు. దీంతో వాగ్వాదానికి దిగిన సెరెనా ఛైర్‌ అంపైర్‌ కార్లోస్‌ను దొంగ అంటూ సంబోధిస్తూ ఆగ్రహంతో రాకెట్‌ను నేలకేసి కొట్టింది.

సెరెనాకు ఛైర్ అంఫైర్ జరిమానా

సెరెనాకు ఛైర్ అంఫైర్ జరిమానా

ఆట నిబంధనలు ఉల్లంఘించడంతో ఛైర్‌ అంపైర్‌ ఆమెకు ఒక పాయింట్‌ జరిమానా విధించాడు. తర్వాత మ్యాచ్‌ రెఫరీని పిలిచి ఛైర్‌అంపైర్‌పై ఫిర్యాదు చేసి అతను క్షమాపణ చేప్పాలని సెరెనా డిమాండ్‌ చేసింది. సెరెనా విలియమ్స్ ‘సెక్సిజం' ఆరోపణల వెనక కారణమేమిటంటే... నవోమీ ఒసాకా చేతిలో 6-2 తేడాతో తొలి సెట్ ఓడిన తర్వాత తీవ్ర ఒత్తిడికి గురవ్వడమేనని టెన్నిస్ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై సెరెనా మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తన కోచ్‌ పాట్రిక్‌ మౌరటోగ్లో రెండో సెట్‌ సమయంలో తనకు ఎలాంటి సాయం చేయలేదని అన్నారు.

‘సెక్సిజం' కారణంగానే

‘సెక్సిజం' కారణంగానే

అంతేకాదు "నేను చీట్ చేయను... చీట్ చేసి గెలవాల్సిన అవసరం నాకు లేదు. అలా గెలవాల్సి వస్తే ఓడిపోవడానికి ప్రాధాన్యం ఇస్తా... నువ్వు నా క్యారెక్టర్‌ను నిందిస్తున్నావు. నువ్వు అబద్దాల కోరువి. దొంగవీ... ఇకపై నేను ఆడబోయే ఏ మ్యాచ్‌లోనూ నిన్ను ఉండకుండా చేస్తా" అని సెరెనా విలియమ్స్ విరుచుకుపడింది. తాను మహిళను కాబట్టే అంపైర్లు తనపై ఇలా కఠినంగా వ్యవహరిస్తున్నారని, పురుషుల సింగిల్స్ మ్యాచుల్లో ఇలాంటి నిబంధనలు ఎందుకు గుర్తుకురావంటూ నిలదీసింది సెరీనా. ‘సెక్సిజం' కారణంగానే మహిళలను చిన్న చూపు చూస్తున్నారంటూ వాపోయింది.

Story first published: Wednesday, September 12, 2018, 11:29 [IST]
Other articles published on Sep 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X