For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏటీపీ పైనల్స్: 14వసారి సెమీస్‌కు చేరిన ఫెదరర్

By Nageshwara Rao
ATP Finals: Roger Federer beats Alexander Zverev, Jack Sock beats Marin Cilic

హైదరాబాద్: లండన్‌లో జరుగుతున్న సీజన్‌ ముగింపు టెన్నిస్‌ టోర్నమెంట్‌ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ సత్తా చాటాడు. 'బోరిస్‌ బెకర్‌ గ్రూప్‌'లో భాగంగా అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.

36 ఏళ్ల రోజర్ ఫెదరర్ మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌పై 7-6 (8/6), 5-7, 6-1తో నెగ్గి టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేశాడు. ఏటీపీ వరల్డ్ టూర్ టోర్నీ చరిత్రలో ఫెదరర్‌ సెమీస్‌కు చేరుకోవడం 14వసారి కావడం విశేషం.

గురువారం జరిగే సెమీ పైనల్స్‌లో ఫెదరర్ అమెరికాకు చెందిన జాక్ సాక్‌తో తలపడనున్నాడు. 8వ సీడ్ జాక్ సాక్ క్వార్టర్స్‌లో ఐదో సీడ్ మారిన్ సైలిక్‌పై 5-7 6-2 7-6 (7-4)తేడాతో విజయం సాధించాడు. మరోవైపు 'పీట్‌ సంప్రాస్‌ గ్రూప్‌' నుంచి దిమిత్రోవ్‌ (బల్గేరియా) రెండు విజయాలు సాధించి సెమీస్‌కు చేరాడు.

Story first published: Thursday, November 16, 2017, 10:06 [IST]
Other articles published on Nov 16, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+