For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అస్ల‌న్ కొత్త రికార్డు.. క్వాలిఫయర్‌గా అడుగుపెట్టి! సెరెనా vs ఒసాకా!

Aslan Karatsev makes history at Australian Open with enters to semi finals

మెల్‌బోర్న్‌: ర‌ష్యా టెన్నిస్ క్రీడాకారుడు అస్ల‌న్ క‌ర‌త్సేవ్ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనం సృష్టించాడు. మెల్‌బోర్న్‌లో జ‌రుగుతున్న ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌ 2021లో సెమీఫైన‌ల్లోకి ప్ర‌వేశించాడు. ఓపెన్ ఎరాలో అరంగేట్రం చేసిన గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే సెమీస్‌కు చేరిన తొలి టెన్నిస్ ప్లేయ‌ర్‌గా 27 ఏళ్ల అస్ల‌న్ రికార్డు సృష్టించాడు. క్వాలిఫై ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగిన అస్ల‌న్‌ 2-6, 6-4, 6-1, 6-2 స్కోర్‌తో క్వార్టర్స్‌లో దిమిత్రోవ్‌పై విజ‌యం సాధించాడు. సెమీస్‌లో నోవాక్ జకోవిచ్‌తో అస్లాన్‌ తలపడనున్నాడు.

క్వార్ట‌ర్స్ మ్యాచ్‌లో దిమిత్రోవ్ గాయంతో స‌త‌మ‌తం అయ్యాడు. మ్యాచ్‌లో మెడిక‌ల్ టైమౌట్ తీసుకున్న దిమిత్రోవ్‌.. ర‌ష్యా ఆట‌గాడు క‌ర‌త్సేవ్ ముందు చేతులెత్తేశాడు. ఇది న‌మ్మ‌క‌లేక‌పోతున్నా, సెమీస్‌కు వెళ్ల‌డం ఇదే తొలిసారి అని మ్యాచ్ అనంతరం క‌ర‌త్సేవ్ అన్నాడు. 1977లో బాబ్ గిల్టిన‌న్ ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో క్వాలిఫైర్‌గా పోటీలోకి దిగి సెమీస్ వ‌ర‌కు వెళ్లాడు. 114వ ర్యాంక్‌లో ఉన్న అస్ల‌న్‌.. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు చేర‌డం మ‌రో విశేషం. ఈ టోర్నీలో 8వ సీడ్ డీగో స్వాట్జ్‌మ్యాన్‌, 20వ సీడ్ ఫెలిక్స్ ఆగ‌ర్ అలిసైమ్‌ల‌ను క‌ర‌త్సేవ్ ఓడించాడు.

క్వార్టర్స్‌లో సెర్బియా స్టార్‌ నోవాక్ జకోవిచ్‌ 6-7 (6-8), 6-2, 6-4, 7-6 (8-6)తో ఆరోసీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై నెగ్గాడు. తొలి సెట్‌ను టై బ్రేకర్‌లో ఓడిన జకో.. ఆ తర్వాత పుంజుకుని వరుసగా మూడు సెట్లను గెలుచుకున్నాడు. టై బ్రేకర్‌కు మళ్లిన నాలుగో సెట్లో జ్వెరెవ్‌ హోరాహోరీగానే పోరాడినా.. ఒత్తిడిని తట్టుకుంటూ వరుసగా పాయింట్లు సాధించిన జకో 8-6తో టై బ్రేకర్‌తో పాటు సెట్‌ను, మ్యాచ్‌ను గెలుచుకున్నాడు.

మార్గరెట్‌ కోర్ట్‌ (24 టైటిళ్లు) రికార్డును సమం చేయాలన్న పట్టుదలతో ఉన్న అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్‌ సెమీస్‌ చేరింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో పదోసీడ్‌ సెరెనా 6-3, 6-3తో సిమోనా హలెప్‌ (రొమేనియా)పై విజయం సాధించింది. 24వ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ విజయం సాధించి అత్యధిక టైటిళ్ల మార్గరెట్‌ కోర్ట్‌ రికార్డు సమం చేయాలని పట్టుదలగా ఉన్న సెరెనా.. సెమీస్‌లో నవోమీ ఒసాక (జపాన్‌)తో తలపడనుంది. క్వార్టర్స్‌లో ఒసాక 6-2, 6-2 తేడాతో సువీయ్‌ (చైనీస్‌ తైపీ)పై గెలిచింది. గత మ్యాచ్‌ల్లో బియాంక ఆండ్రెస్కూ, వోండ్రుసోవా లాంటి సీడెడ్లను కంగుతినిపించిన సువీయ్‌.. క్వార్టర్స్‌లో ఒసాకా జోరు ముందు నిలువలేకపోయింది.

Story first published: Wednesday, February 17, 2021, 7:35 [IST]
Other articles published on Feb 17, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+