ముద్దాడి కేకపెట్టిన సానియా: సీమా కంటతడి(పిక్చర్స్)
ఇంచియాన్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, సాకేత్ మైనేని జోడీ ఆసియా క్రీడల్లో మెరిసిపోయింది. సోమవారం మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకొని సత్తా చాటింది. అంతకు ముందు ప్రార్థన తొంబారేతో కలిసి మహిళల డబుల్స్‌లో సానియా కాంస్య పతకాన్ని సాధిస్తే, పురుషుల డబుల్స్‌లో సాకేత్ రజత పతకాన్ని గెల్చుకున్నాడు. సాకేత్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో టైటిల్ అందుకున్నాడు.
సానియా, మైనేని జోడీ ఫైనల్‌లో సియెన్ ఇన్ పెంగ్, హవో చింగ్ చాన్ (చైనీస్ తైపీ) జోడీని 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేసింది. ఈసారి ఆసియా క్రీడల్లో రెండో పతకాన్ని అందుకుంది. నాలుగేళ్ల క్రితం గాంగ్జూలో జరిగిన ఏషియాడ్‌లో ఆమె విష్ణువర్ధన్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో రజత పతకాన్ని గెల్చుకుంది. సింగిల్స్‌లో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 2006 దోహా ఆసియా క్రీడల్లో లియాండర్ పేస్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం, సింగిల్స్ రజతం, టీం ఈవెంట్‌లో మరో రజతాన్ని సాధించింది. కాగా, స్వర్ణ పతకం సాధించిన సానియా జోడీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశే ఖర్‌రావు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.
సీమా పూనియా 'గోల్డెన్' త్రో
డిస్కస్ త్రోయర్ సీమా పునియా అద్వితీయ ప్రతిభ భారత్‌కు 17వ ఆసియా క్రీడల్లో తొలి అథ్లెటిక్స్ స్వర్ణాన్ని అందించింది. ఏషియాడ్‌లో సీమకు ఇదే మొదటి పతకం. నాలుగో ప్రయత్నంలో డిస్కస్‌ను 61.03 మీటర్ల దూరానికి విసిరిన ఆమె అగ్రస్థానాన్ని సంపాదించింది. సీనియర్ డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియా 55.57 మీటర్లకు పరిమితమై, నాలుగో స్థానంలో నిలిచింది. గత రెండు ఆసియా క్రీడల్లో పాల్గొనలేకపోయిన 31 ఏళ్ల సీమ ఇటీవల గ్లాస్గోలో జరిగిన కామన్వెవల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని సాధించింది.
పురుషుల డబుల్స్‌లో రజతం
టెన్నిస్ పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో భారత్‌కు రజత పతకం లభించింది. సాకేత్ మైనేని, సనమ్ సింగ్ జోడీ ఫైనల్‌లో దక్షిణ కొరియా జోడీ హోంగ్‌క్యూ లిమ్, హయోన్ చుంగ్ చేతిలో 5-7, 6-7 తేడాతో పరాజయాన్ని ఎదుర్కోవడంతో రజత పతకానికి పరిమితమైంది.
రెజ్లింగ్‌లో భజరంగ్‌కు రజతం, నర్సింగ్ యాదవ్‌కు కాంస్యం

సానియా
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, సాకేత్ మైనేని జోడీ ఆసియా క్రీడల్లో మెరిసిపోయింది.

తల్లితో సానియా
సానియా మీర్జా సోమవారం మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకొని సత్తా చాటింది.

సానియా-సాకేత్ ముద్దాడుతూ..
సాకేత్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో టైటిల్ అందుకున్నాడు.

సానియా ఆనందం
సానియా, మైనేని జోడీ ఫైనల్‌లో సియెన్ ఇన్ పెంగ్, హవో చింగ్ చాన్ (చైనీస్ తైపీ) జోడీని 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేసింది.

సాకేత్-సానియా
సానియా, మైనేని జోడీ ఫైనల్‌లో సియెన్ ఇన్ పెంగ్, హవో చింగ్ చాన్ (చైనీస్ తైపీ) జోడీని 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేసింది.

సాకేత్-సానియా
ఈసారి ఆసియా క్రీడల్లో రెండో పతకాన్ని అందుకుంది. నాలుగేళ్ల క్రితం గాంగ్జూలో జరిగిన ఏషియాడ్‌లో ఆమె విష్ణువర్ధన్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో రజత పతకాన్ని గెల్చుకుంది.

కేక పెట్టిన సాకేత్-సానియా
సింగిల్స్‌లో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 2006 దోహా ఆసియా క్రీడల్లో లియాండర్ పేస్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం, సింగిల్స్ రజతం, టీం ఈవెంట్‌లో మరో రజతాన్ని సాధించింది.

పతకాలతో..
స్వర్ణ పతకం సాధించిన సానియా మీర్జా జోడీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.

స్వర్ణ విజేత పూనియా
డిస్కస్ త్రోయర్ సీమా పునియా అద్వితీయ ప్రతిభ భారత్‌కు 17వ ఆసియా క్రీడల్లో తొలి అథ్లెటిక్స్ స్వర్ణాన్ని అందించింది.

కంటతడి పెట్టిన పూనియా
ఏషియాడ్‌లో సీమకు ఇదే మొదటి పతకం. నాలుగో ప్రయత్నంలో డిస్కస్‌ను 61.03 మీటర్ల దూరానికి విసిరిన ఆమె అగ్రస్థానాన్ని సంపాదించింది.

పతకంతో భజరంగ్
ఆసియా క్రీడల్లో సోమవారం రెజ్లింగ్‌లో భారత్‌కు రజత పతకం లభించింది. యోగేశ్వర్ దత్ ఆదివారం స్వర్ణ పతకాన్ని సాధించగా, తాజాగా భజరంగ్ కుమార్ భారత్‌కు రజత పతకాన్ని అందించాడు.
ఆసియా క్రీడల్లో సోమవారం రెజ్లింగ్‌లో భారత్‌కు రజత పతకం లభించింది. యోగేశ్వర్ దత్ ఆదివారం స్వర్ణ పతకాన్ని సాధించగా, తాజాగా భజరంగ్ కుమార్ భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. హోరాహోరీ పోరాటాలు సాగించి 61 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్ వరకూ చేరిన భజరంగ్ టైటిల్ పోరులో ఇరాన్ రెజ్లర్ మసూద్ మహమ్మద్‌కు గట్టిపోటీనిచ్చాడు. కానీ అత్యంత కీలక దశలో పట్టు కోల్పోవడం ద్వారా తృటిలో స్వర్ణాన్ని చేజార్చుకొని రజత పతకంతో సంతృప్తి చెందాడు.
పురుషుల రెజ్లింగ్ 74 కిలోల విభాగంలో నర్సింగ్ పంచమ్ యాదవ్ కాంస్య పతకాన్ని అందుకున్నాడు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో అతను జపాన్ రెజ్లర్ దైసుకే షిమాదాను 3-1 తేడాతో ఓడించాడు. ఈ బౌట్‌లో ఎవరు గెలుస్తారన్నది చివరి క్షణం వరకూ స్పష్టం కాలేదు. పోరు ముగిసే సమయంలో నర్సింగ్ సర్వశక్తులు ఒడ్డి షిమాదాపై ఆధిపత్యాన్ని సంపాదించి, కాంస్యాన్ని అందుకోగలిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications