For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా గేమ్స్: టెన్నిస్‌లో మూడో పతకం నెగ్గిన ప్రజ్నెష్ గుణేశ్వరన్

By Nageshwara Rao
 Asian Games 2018, Tennis: Prajnesh Gunneswaran settles for bronze in mens singles

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత్‌ జోరు కొనసాగుతోంది. టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌‌లో భారత్‌ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన పోటీల్లో భారత టెన్నిస్ ఆటగాడు ప్రజ్నెష్ గుణేశ్వరన్ కాంస్య పతకం సాధించాడు.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

సెమీఫైనల్లో ఉబ్జెకిస్థాన్‌కు చెందిన డెనిస్ ఇస్తోమిన్ చేతిలో 2-6, 2-6 తేడాతో ప్రజ్నెష్ గుణేశ్వరన్ ఓటమిపాలయ్యాడు. దీంతో కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ మ్యాచ్‌లో ప్రజ్నెష్ గుణేశ్వరన్ ఏ దశలోనూ తన ప్రత్యర్ధికి పోటీ ఇవ్వలేకపోయాడు. టెన్నిస్‌లో భారత్‌కు ఇది మూడో పతకం కావడం విశేషం.

తాజా పతకంతో ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 25కు చేరింది. ప్రస్తుతం భారత ఖాతాలో 6 స్వర్ణ, 5 రజత, 14 కాంస్య పతకాలు ఉన్నాయి.

అంతకముందు టెన్నిస్‌ పురుషుల డబుల్స్‌ ఫైనల్లో భారత జోడి రోహన్‌ బోపన్న-దివిజ్‌ శరణ్‌ జోడీ స్వర్ణ పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో కజకిస్థాన్‌ జోడీపై రోహన్‌ బోపన్న, దివిజ్‌ శరన్‌ జోడీ 6-3, 6-4 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకంతో మెరిసింది. తొలి సెట్‌ను 6-3 తేడాతో గెలిచిన బోపన్న జోడి.. రెండో సెట్‌ను 6-4తో సొంతం చేసుకుంది.

Story first published: Friday, August 24, 2018, 19:22 [IST]
Other articles published on Aug 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+