ప్రిక్వార్టర్స్‌లో సింధు, సైనా.. శ్రీకాంత్ ఔట్

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లు శుభారంభం చేయగా.. మరో స్టార్ కిదాంబి శ్రీకాంత్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మరోవైపు సమీర్ వర్మ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. దీంతో రెండో రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

సింధు, సైనా దూకుడు:
బుధవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ సింధు 21-14, 21-7తో సయాక తకహాషి (జపాన్)పై గెలుపొందింది. సింధు కేవలం 28 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించింది. సింధు దాడికి ఎక్కడాకూడా తకహాషి నిలవలేకపోయింది. ఏడో సీడ్ సైనా 12-21, 21-11, 21-17తో హాన్ యువె (చైనా)పై విజయం సాధించింది. మొదట గేమ్ కోల్పోయిన సైనా.. అనంతరం శ్రమించి వరుసగా రెండు గేముల్లో సత్తా చాటింది.

తొలి రౌండ్లోనే శ్రీకాంత్ ఔట్:
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 8వ ర్యాంకర్ శ్రీకాంత్ 16-21, 20-22తో 51వ ర్యాంకర్ షెసర్ హిరెన్ రుస్తావితొ (ఇండోనేసియా) చేతిలో ఓటమిని ఎదుర్కొన్నాడు. 44 నిమిషాల పాటు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. రుస్తావిటో చేతిలో శ్రీకాంత్‌కిది రెండో పరాజయం. ఇక ప్రపంచ 15వ ర్యాంకర్ సమీర్ వర్మ 21-13, 17-21, 21-18తో కజుమసా సకాయ్ (జపాన్)పై గెలుపొందాడు.

డబుల్స్‌లో మిశ్రమ ఫలితాలు:
మహిళల డబుల్స్, పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో అన్ని జోడీలు పరాజయం పాలయ్యాయి. జక్కంపూడి మేఘన-పూర్వీషా రామ్ (భారత్) 13-21, 16-21తో జాంగ్ కొల్ఫాన్-రవింద (థాయ్‌లాండ్) చేతిలో.. దండు పూజ-సంజన సంతోష్ (భారత్) 13-21, 21-12, 12-21తో ప్రమోదిక-కవిది (శ్రీలంక) చేతిలో.. అపర్ణ బాలన్-శ్రుతి (భారత్) 12-21, 10-21తో యుజియా జిన్-మింగ్ హుయ్ లిమ్ (సింగపూర్) చేతిలో ఓటమిని చవిచూశారు. ఎంఆర్ అర్జున్-శ్లోక్ రామచంద్రన్ (భారత్) 18-21, 15-21తో హి జిటింగ్-తాన్ కియాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications