Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వింబుల్డన్‌: బార్టీ అలకోకగా.. ఫెదరర్‌ కష్టంగా

Ash Barty, Roger Federer Advance at Wimbledon; French Open Finalist Dominic Thiem Upset

ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ టోర్నీలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత, మహిళల సింగిల్స్‌లో నెం.1 ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) శుభారంభం చేసింది. ఎనిమిదిసార్లు వింబుల్డన్ టైటిల్ గెలిచిన స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ మొదటి రౌండ్‌లో ఎల్.హారిస్ (దక్షిణాఫ్రికా)పై కష్టపడి నెగ్గాడు. మిగతా స్టార్లలో రఫెల్‌ నాదల్‌, ఏంజెలిక్‌ కెర్బర్‌, సెరెనా విలియమ్స్‌ రెండో రౌండ్‌ చేరారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మంగళవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో బార్టీ 6-4, 6-2తో జంగ్‌ (చైనా)పై అలవోకగా గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్‌లోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) 6-2, 6-4తో బిసిన్‌స్కీ (స్విట్జర్లాండ్‌) పై, మాజీ నెం.1, ఐదో సీడ్‌ ఏంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ) 6-4, 6-3తో మరియ (జర్మనీ)పై, వరల్డ్‌ నెం.13 బెనిసిచ్‌ (స్విట్జర్లాండ్‌) 6-2, 6-3తో పవ్లిచెంకోవా(రష్యా)పై గెలుపొందారు.

అమెరికా క్రీడాకారిణి, మాజీ చాంపియన్ సెరీనా విలియమ్స్(10వ ర్యాంకు) 6-2, 7-5 తేడాతో గట్టో మోంటికోన్(ఇటలీ)పై గెలిచి ముందడుగు వేసింది. షరపోవా 6-4, 6-7 (7), 0-5తో ప్రత్యర్థి పార్మింటీర్‌ వెనుకంజలో ఉన్న దశలో గాయంతో వైదొలగింది. 9వ సీడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌, స్థానిక స్టార్‌ జొహాన కొంటా కూడా రెండోరౌండ్‌ చేరారు.

పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్ మొదటి రౌండ్‌లో హారీస్‌పై 3-6, 6-1, 6-2, 6-2తో కష్టపడి నెగ్గాడు. కేవలం 28 నిమిషాల్లోనే మొదటి సెట్‌ను ఫెదరర్‌ కోల్పోయాడు. అయితే రెండో సెట్‌ నుంచి హారీస్‌కు చూపిస్తూ వరుసగా మూడు సెట్లను గెలిచిన ఫెదరర్‌.. రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. అన్‌సీడెడ్‌ సామ్‌ కెర్రీ 6-7 (7), 7-6 (1), 6-3, 6-0తో ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ను కంగుతినిపించాడు. నాదల్‌ 6-3, 6-1, 6-3తో యూచి సుగిటపై గెలిచారు. 8వ సీడ్‌ నిషికోరి 6-4, 7-6 (3), 6-4తో థియాగో మాంటీరోపై, అన్‌సీడెడ్‌ కిర్గియోస్‌ 7-6 (4), 3-6, 7-6 (10), 0-6, 6-1తో జోర్డాన్‌ థాంప్సన్‌పై నెగ్గారు.

Story first published: Wednesday, July 3, 2019, 8:35 [IST]
Other articles published on Jul 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+