For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wimbledon 2021: సూపర్‌ సబలెంకా.. 15వ ప్రయత్నంలో సెమీఫైనల్‌ బెర్త్‌! తొలిసారి సెమీస్‌ చేరిన బార్టీ!

Aryna Sabalenka, Ashleigh Barty and Angelique Kerber into Wimbledon 2021 semifinals

లండన్‌: వింబుల్డన్‌ 2021 తుది ఘట్టానికి చేరుకుంది. మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ, రెండో సీడ్‌ అరీనా సబలెంక, మాజీ నంబర్‌వన్‌ కరోలినా ప్లిస్కోవా, మాజీ చాంపియన్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. కెరీర్‌లో 14 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడినా.. ఒక్కసారి కూడా నాలుగో రౌండ్‌ దాటలేకపోయిన బెలారస్‌ భామ సబలెంకా 15వ ప్రయత్నంలో మాత్రం సెమీఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. సబలెంకా క్వార్టర్‌ ఫైనల్లో 6-4, 6-3తో 21వ సీడ్‌ ఆన్స్‌ జెబర్‌ (ట్యూనిషియా)పై గెలిచింది. 74 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా మూడు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది.

ఈ విజయంతో నటాషా జ్వెరెవా (1998), విక్టోరియా అజరెంకా (2011, 20112) తర్వాత వింబుల్డన్‌ టోర్నీలో సెమీఫైనల్‌ చేరిన మూడో బెలారస్‌ క్రీడాకారిణిగా అరీనా సబలెంకా గుర్తింపు పొందింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆష్లే బార్టీ క్వార్టర్‌ఫైనల్లో 6-1, 6-3తో తొమ్లనోవిచ్‌ (ఆస్ట్రేలియా)ను చిత్తుగా ఓడించింది. బార్టీ 5 ఏస్‌లు, 23 విన్నర్లు కొట్టింది. మరో క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌) 6-2, 6-2తో అన్‌ సీడెడ్‌ విక్టోరియా గోల్బిచ్‌ (స్విట్జర్లాండ్‌)ను అలవోకగా ఓడించింది. ప్లిస్కోవా తన సర్వీసులో కేవలం 13 పాయింట్లు కోల్పోయింది. వింబుల్డన్‌ సెమీస్‌ చేరడం ఆమెకు ఇదే తొలిసారి.

మాజీ నంబర్‌వన్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ) కూడా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ఆమె 6-2, 6-3తో ముచోవా (చెక్‌)పై విజయం సాధించింది. తాజా విజయంతో ఆమె నాలుగోసారి వింబుల్డన్‌ సెమీఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది. 2012లో సెమీస్‌ చేరిన కెర్బర్‌.. 2016లో రన్నరప్‌గా నిలిచింది. ఇక గురువారం జరిగే సెమీ ఫైనల్స్‌లో బార్టీతో కెర్బర్‌, ప్లిస్కోవాతో సబలెంకా తలపడతారు. ఇందులో గెలిచిన వారు ఫైనల్లో తలపడతారు.

పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ డానియెల్ మెద్వెదెవ్‌ (రష్యా) కథ ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. 14వ సీడ్‌ హుబర్ట్‌ హర్కజ్‌ (పోలెండ్‌) 2-6, 7-6 (7-2), 3-6, 6-3, 6-3తో అతడికి షాకిచ్చి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ గెలుపుతో హుబర్ట్‌ తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో హర్కజ్‌ 10 ఏస్‌లు, 47 విన్నర్లు కొట్టాడు. ఆరో సీడ్‌ రోజర్ ఫెదరర్‌ (స్విట్టర్లాండ్‌) 7-5, 6-4, 6-2తో సొనెగో (ఇటలీ)ను ఓడించి క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. ఈరోజు జరిగే పురుషుల క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఫుచోవిచ్‌ (హంగేరి)తో జొకోవిచ్‌ (సెర్బియా), హుబర్ట్‌తో ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), షపోవలోవ్‌ (కెనడా)తో ఖచనోవ్‌ (రష్యా), ఫీలిక్స్‌ (కెనడా)తో బెరెటిని (ఇటలీ) తలపడతారు.

Story first published: Wednesday, July 7, 2021, 7:06 [IST]
Other articles published on Jul 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+