Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షరపోవా ఆట తుస్.. ఆదాయం అదుర్స్...

Maria Sharapova
మరియా షరపోవా.. బ్యాడ్మింటన్ అభిమానులకు గుర్తిండిపోయే పేరు.. తన అరుపులు, కేకలతో అవతలి వారిని బెంబేలెత్తించే ఈ రష్యన్ ముద్దుగుమ్మ ఒకప్పుడు బ్యాడ్మింటన్ మహిళా విభాగంలో సంచలనాలు సృష్టించింది. అయితే ఇప్పుడు కథంతా మారిపోయింది. గాయాలతో సతమతమవుతూ అగ్రస్థానానికి దూరమైంది. అక్కడ నెంబర్ వన్ కాకాపోయినా సంపాదనలో మాత్రం తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఇంతకు ఆమో వార్షికాదాయం ఎంతో తెలుసా అక్షరాలా 112 కోట్లు. 2008 నుంచి ఒక్క గ్రాండ్ స్లామ్ కరీటమూ షరపోవా సొంతంచేసుకోలేకపోయినా తాజా ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుణుల జాబితాలో చేరిపోయింది.
ఆటలో అగ్రస్థానం చేజిక్కించుకోకపోయినా .. అర్జనలో మాత్రం వరుసగా ఏడో ఏడాది మరియా షరపోవానే టాప్. టెన్నిస్ లో నెంబర్ వన్ గా ఉన్న డెన్మార్క్ క్రీడాకారణి కరోలినా వోజ్నియా ఆదాయానికి దాదాపు రెండింతలు ఎక్కువగా షరపోవా సంపాదిస్తోంది. ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన టాప్ టెన్ మహిళల జాబితాలు ఓ సారి చూద్దాం.

షరపోవా : రూ.112.5కోట్లు
వోజ్నియాకి : రూ.56.25కోట్లు
డానికా ప్యాట్రిక్ : రూ.54కోట్లు
వీనస్: రూ.51.75కోట్లు
క్లియ్ స్టర్స్ : రూ.49.5కోట్లు
సెరెనా : రూ.47.25కోట్లు
కిమ్ యునా : రూ.45కోట్లు
లినా : రూ36కోట్లు
ఇవనోవిచ్ : రూ.27కోట్లు
పాలా క్రీమర్ : రూ.24.75కోట్లు

ఆదాయంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న షరపోవా దూకుడుకు వచ్చే ఏడాది బ్రేక్ పడబోతోందంటున్నారు మార్కెట్ పండితులు. ఫ్రెంచ్ ఓపెన్ కిరీటం నెగ్గిన చైనా చిన్నది లినా సంచలనాలే ఇందుకు కారణం.

ఈ యువ కెరటం చుట్టూ ఇప్పుడు ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలన్ని ప్రదక్షిణలు చేస్తున్నాయి. తాజా ఫోర్బ్స్ జాబితాలో లినా 8 మిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే వచ్చే ఏడాది షరపోవాను అవలీలగా దాటేయనుందని అంచనా వేస్తున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+