Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏదైనా సాధించవచ్చు..కానీ ఆ ఒక్కటి ఉండాలి!- సానియా మీర్జా

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల అనంతరం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. విడాకుల విషయం ప్రపంచానికి తెలియకముందు సగటున వారానికి ఒక్క పోస్ట్ మాత్రమే పంచుకునేది. కానీ ఇటీవల సానియా వరుస పోస్ట్‌లతో తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అంతేగాక ద్వందార్థం వచ్చేలా ఫొటోలకు క్యాప్షన్స్ రాసుకొస్తుంది.

విడాకుల అనంతరం సానియా పంచుకున్న తన ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అద్దంలో తనని తాను చూసుకుంటూ ఫొటోకు ఫోజిచ్చింది. దానికి 'రిఫ్లెక్ట్' అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. అయితే ఆ ఒక్క పదంలో లోతైన భావం దాగి ఉందని నెటిజన్లు చర్చలు పెట్టారు.రిఫ్లెక్ట్ అంటే కేవలం ప్రతిబింబించు అనే అర్థమే రాదని, 'లోతుగా లేదా జాగ్రత్తగా ఆలోచించండి' అనే అర్థం కూడా వస్తుందని వివరించారు.

Anything is possible with that- Sania Mirza

అయితే తాజాగా సానియా చేసిన మరో పోస్ట్‌‌ క్యాప్షన్‌పై కూడా నెటిజన్లు పరిశోధనలు మొదలుపెట్టారు. తమ బుర్రలకు పదునుపెడుతూ ఆ క్యాప్షన్‌ను ఢీకోడ్ చేస్తున్నారు. ఇంతకీ సానియా ఏం పోస్ట్ చేసిందంటే.. పింక్ షర్ట్‌‌తో దిగిన స్టిల్స్‌ను సానియా ఇ‌న్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. 'సన్‌షైన్, కాస్త పింక్ ఉంటే ఏదైనా సాధ్యమే' అని రాసుకొచ్చింది. దీనికి నెటిజన్లు భిన్నంగా ఆలోచిస్తూ.. సన్‌షైన్ అంటే సూర్యరశ్మి అని మాత్రమే కాదని, ఉల్లాసం, సంతోషం, ఆనందం అనే అర్థాలు కూడా వస్తాయని చెబుతున్నారు. జీవితంలో కాస్త సంతోషం ఉంటే ఏదైనా సాధించవచ్చని సానియా మీర్జా ఇలా పరోక్షంగా రాసుకొచ్చిందని కొందరు నెటిజన్లు వారి ఊహలకు పనిచెప్పారు.

ఇటీవల షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సానియా మీర్జాను షోయబ్ మాలిక్ 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికీ షోయ‌బ్‌కు అది రెండో వివాహం కావడం గమనార్హం. తన తొలి భార్య అయేషా సిద్ధిఖితో విడాకుల అనంతరం సానియాను పెళ్లి చేసుకున్నాడు. తాజాగా పాకిస్థాన్ ప్రముఖ నటి సనా జావేద్‌ను మాలిక్ వివాహమాడాడు. స‌నా జావేద్‌కు ఇది రెండో వివాహం. పాకిస్తాన్‌ కు చెందిన ఈ ప్ర‌ముఖ న‌టీ వయసు 28 ఏళ్లు. 2020లో సింగర్ ఉమైర్ జ‌స్వాల్‌ను ఆమె వివాహం చేసుకుంది. కానీ కొద్దికాలానికే ఈ దంప‌తుల మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి.

Story first published: Thursday, February 1, 2024, 17:15 [IST]
Other articles published on Feb 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+