కవలకు జన్మనిచ్చిన మాజీ టెన్నిస్ సుందరి కౌర్నికోవా

హైదరాబాద్: అన్నా కౌర్నికోవా.... టెన్నిస్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆటతో కంటే తన అందంతోనే ఎక్కువగా అభిమానుల్ని ఆకర్షించింది. రష్యాకు చెందిన ఈ టెన్నిస్ భామ ఆటకు వీడ్కోలు పలికినా... ఆమెపై అభిమానులకు ఆకర్షణ ఎంతమాత్రం తగ్గలేదు.
తాజాగా కౌర్నికోవా కవల పిల్లలకు జన్మనివ్వడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచింది. గత పదేళ్లుగా స్పెయిన్‌కు చెందిన సింగర్ ఎన్రిక్ ఇగ్లెసియాస్‌తో సహజీవనం చేస్తున్న కౌర్నికోవా.. గర్భం దాల్చిన సంగతి బయటి ప్రపంచానికి తెలియక పోవడం విశేషం.
అయితే గత వారం ఫ్లోరిడాలోని మియామిలో 36 ఏళ్ల కౌర్నికోవా కవలలకు జన్మనివ్వడంతో ఒక్కసారిగా మళ్లీ వార్తల్లో నిలిచింది. కవలల్లో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. వీరికి నికోలస్, లూసీ అనే పేర్లు పెట్టారు. పిల్లలకు జన్మనిచ్చిన అనంతరం బోటులో దిగిన ఫోటోలను కౌర్నికోవా తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications