ప్రెంచ్ ఓపెన్ క్వాలిఫయర్స్: తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన అంకిత రైనా

హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత క్రీడాకారిణి అంకిత రైనా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. మంగళవారం పదో సీడ్ రొడీనా(రష్యా)తో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో అంకిత 3-6, 6-7 (2/7)తో ఓడిపోయింది.
గంటా 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత రైనా తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడు సార్లు బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్‌లో అంకిత 52 అనవసర తప్పిదాలు చేసింది. అయితే నెట్‌వద్ద 15 పాయింట్లు సాధించడం గమనార్హం.
పారిస్‌లో జరుగుతున్న ఈ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ నుంచి నలుగురు క్రీడాకారులు బరిలోకి దిగగా.... ప్రజ్నేశ్ ఒక్కడే రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. అంకిత రైనా, సుమీత్ నగాల్, రామ్‌కుమార్ తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సుమిత్ నగాల్ స్లోవేకియాకు చెందిన మార్టిన్ క్లిజాన్ చేతిలో 4-6, 6-4, 6-1 తేడాతో ఓటమి పాలయ్యాడు. టాప్-100 ర్యాంకింగ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న భారత ఆటగాడు యూకీ బాంబ్రీ ఈ టోర్నీలో మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications