సంచలనం: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత కెర్బర్, సెరెనా ఓటమి
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం చోటుచేసుకుంది. మెల్‌బోర్న్ పార్కులో జరిగిన మహిళల సింగిల్స్ పైనల్ మ్యాచ్‌లో జర్మనీ క్రీడాకారిణి ఏంజెలికా కెర్బర్ చేతిలో సెరెనా విలియమ్స్ ఓటమి పాలైంది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6-4, 3-6, 6-4, తేడాతో సెరెనా విలియమ్స్ పరాజయం పాలైంది.
దీంతో తన కెరీర్‌లో 22 గ్రాండ్ స్లామ్ సాధించి స్టెఫీ గ్రాఫ్ రికార్డును సమానం చేద్దామనుకున్న సెరెనా ఆశలు తీరలేదు. అంతేకాదు ఏడోసారి ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్‌ను గెలుద్దామనుకున్న లక్ష్యం కూడా నెరవేర లేదు. మహిళల టెన్నిస్‌లో ప్రపంచ నెంబర్ వన్‌గా ఉన్న సెరెనా విలిమయ్స్‌కు ఇది ఊహించని షాక్.

అందరి అంచనాలకు మించి రాణించిన కెర్బర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచి సరికొత్త రికార్డుని సృష్టించింది. ఏంజెలికా కెర్బర్‌కు తన కెరీర్‌లో తొలి గ్రాండ్ శ్లామ్ టైటిల్ ఇదే కావడం విశేషం. తొలి సెట్‌లో సెరెనా సర్వీసులను పలుమార్లు బ్రేక్ చేసిన కెర్బర్ ఆద్యంతం చక్కని ఆట తీరుతో సెరెనాపై పైచేయి సాధించింది.
అయితే రెండో సెట్‌లో తిరిగి పుంజుకున్న సెరెనా తనదైన సర్వీసులతో రెచ్చిపోయి రెండో సెట్‌ను చేజిక్కించుకుంది. దీంతో నిర్ణయాత్మక మూడో సెట్‌లో కెర్బర్ అనూహ్యంగా పుంజుకుంది.

మూడో సెట్‌లో సెరెనా అనవసర తప్పిదాలు చేసి తగిన మూల్యం చెల్లించుకుంది. మొత్తంగా చూస్తే తన కెరీర్‌లో 26వ గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడని సెరెనా విలిమయ్స్‌కు ఇది ఐదో ఓటమి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications