Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెరెనాపై కెర్బర్ గెలిచిన వేళ..

Angelique Kerber beats Serena Williams to win Wimbledon

హైదరాబాద్: అమెరికా టెన్నిస్ గ్రేట్ సెరెనా విలియమ్స్ వింబుల్డన్ టైటిల్ ఆశలకు అంజెలిక్ కెర్బర్ గండికొట్టింది. కెర్బర్‌ విజృంభించిన వేళ వింబుల్డన్‌లో ఈ మాజీ ఛాంపియన్‌కు చుక్కెదురైంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో పదకొండో సీడ్‌ కెర్బర్‌ 6-3, 6-3తో వరుస సెట్లలో సెరెనా విలియమ్స్‌ను ఓడించింది.

టైటిల్ గెలిచిన తొలి జర్మన్‌గా కెర్బర్

టైటిల్ గెలిచిన తొలి జర్మన్‌గా కెర్బర్

స్టెఫీగ్రాఫ్(1996) తర్వాత వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి జర్మన్‌గా కెర్బర్ నిలిచింది. మరోవైపు పదోసారి ఫైనల్ చేరిన సెరెనా.. వరుస సెట్లలో ఓటమిపాలై మార్గరెట్ కోర్టు(24) గ్రాండ్‌స్లామ్ రికార్డుకు అడుగుదూరంలో నిలిచిపోయింది. గంటసేపు జరిగిన పోరులో సెరెనా 24 సార్లు అనవసర తప్పిదాలకు పాల్పడి మ్యాచ్‌ను చేజార్చుకుంది.

కెర్బర్‌ 6-3తో తొలి సెట్‌ గెలిచి:

కెర్బర్‌ 6-3తో తొలి సెట్‌ గెలిచి:

మ్యాచ్‌లో ఏ దశలోనూ సెరెనా ఆధిపత్యం కనిపించలేదు. కచ్చితమైన సర్వీసులు, బలమైన ఫోర్‌ హ్యాండ్‌ షాట్లతో చెలరేగిన కెర్బర్‌.. సెరెనాకు అవకాశమే ఇవ్వలేదు. తొలి సెట్‌, తొలి గేమ్‌లోనే సెరెనా సర్వీస్‌ బ్రేక్‌ చేసిన కెర్బర్‌ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే నాలుగో గేమ్‌లో బ్రేక్‌ సాధించిన విలియమ్స్‌ స్కోరు 2-2తో సమం చేసింది. కానీ ఎనిమిదో గేమ్‌లో సెరెనా మరోసారి సర్వీస్‌ కోల్పోవడంతో కెర్బర్‌ 6-3తో తొలి సెట్‌ గెలిచింది. రెండో సెట్లో సెరెనా కాస్త పోరాడింది.

 కెర్బర్‌ కూడా దీటుగా స్పందించడంతో

కెర్బర్‌ కూడా దీటుగా స్పందించడంతో

కెర్బర్‌ కూడా దీటుగా స్పందించడంతో పోటీ హోరాహోరీ సాగింది. ఆరో గేమ్‌లో విలియమ్స్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసి 4-2 ఆధిక్యంలోకి వెళ్లింది జర్మనీ భామ. ఆ తర్వాత మరో రెండు గేమ్‌లు గెలిచి 6-3తో సెట్‌తో పాటు ఛాంపియన్‌షిప్‌ను సాధించింది. తొమ్మిదో గేమ్‌లో సెరెనా 30-30తో స్కోరు సమం చేసింది. ఐతే ఫోర్‌ హ్యాండ్‌ విన్నర్‌తో 40-30తో ఆధిక్యంలోకి వెళ్లిన కెర్బర్‌.. సెరెనా రిటర్న్‌ను కోర్టు అవతలికి కొట్టడంతో సంబరాలు షురూ చేసింది. 2016 వింబుల్డన్‌ ఫైనల్లో సెరెనా చేతిలో ఓటమికి ఆమె బదులు తీర్చుకుంది.

కెర్బర్‌ ఓ ఏస్‌, 11 విన్నర్లు సంధించి:

కెర్బర్‌ ఓ ఏస్‌, 11 విన్నర్లు సంధించి:

గంటా ఐదు నిమిషాల పాటు సాగిన ఏకపక్ష ఫైనల్లో ఆద్యంతం కెర్బర్‌దే హవా సాగింది. కెర్బర్‌ కంటే ఎక్కువగా సెరెనా 4 ఏస్‌లు, 23 విన్నర్లతో విరుచుకుపడ్డా ఫలితం లేకపోయింది. ఏకంగా 24 అనవసర తప్పిదాలకు పాల్పడి మూల్యం చెల్లించుకుంది. కెర్బర్‌ ఓ ఏస్‌, 11 విన్నర్లు సంధించింది.

Story first published: Sunday, July 15, 2018, 10:58 [IST]
Other articles published on Jul 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+