Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఫెదరర్‌ను చూసి ఏడుపు ఆపుకోలేకపోయా'

Andy Roddick and Eugenie Bouchard post brilliant tweets to congratulate Roger Federer

హైదరాబాద్: ఉత్కంఠభరితంగా సాగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ ఆదివారంతో ముగిసింది. ఈ పోరులో ఎవరూ ఊహించని రీతిలో

స్విస్‌ స్టార్‌ ఫెదరర్‌ 36 ఏళ్ల వయస్సులో తన 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. గెలిచిన ఆనందంలో భావోద్వేగానికి గురైయ్యాడు. కప్ గెలుచుకుని కన్నీటి పర్యంతమై తన ప్రసంగాన్ని ముగించాడు.

ఈ విషయం అతని ప్రేక్షకులు, అభిమానులతో పాటు తోటి ప్లేయర్స్‌ను కూడా కంటతడి పెట్టించింది. కెనడాకు చెందిన టెన్నిస్‌ బ్యూటీ ఎవ్‌గెనీ బౌచర్డ్‌ అయితే, రోజర్‌ మాట్లాడినంతసేపు ఏడుస్తూనే ఉందట. ఈ విషయాన్ని తానే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

'మ్యాచ్‌ గెలిచాక రోజర్‌ కన్నీటిపర్యంతమవడం తో నాకు కూడా కన్నీళ్లు ఆగలేదు. అతను ఏడు పు ఆపి ప్రసంగిస్తున్నప్పుడు కూడా నేను ఏడుస్తూనే ఉన్నాను' అని బౌచర్డ్‌ ట్వీట్‌ చేసింది.

ఫెదరర్ పోరాటం సాగిందిలా:
జనవరి 28వ తేదీ జరిగిన ఆస్ట్రేలియాన్ ఓపెన్‌లో స్విస్ టెన్నిస్ దిగ్గజం, డిఫెండింగ్ ఛాంపియన్ రోజర్ ఫెదరర్ విజేతగా నిలిచాడు. దీంతో ఈ టైటిల్‌ను అతను ఆరోసారి గెలుచుకున్నట్లైంది.

మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆరోసీడ్ మారిన్ సిలిచ్‌పై 6-2, 6-7, 6-3, 3-6, 6-1 తేడాతో ఘన విజయం సాధించాడు. తాజా గ్రాండ్‌స్లామ్ ఫెదరర్‌కు తన కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావ‌డం విశేషం.

ఫెదరర్ ఈ విజయంతో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గెలిచిన రాయ్ ఎమ‌ర్స‌న్‌, నొవాక్ జొకోవిచ్‌ల స‌ర‌స‌న నిలిచాడు. సుమారు మూడున్న‌ర గంట‌ల పాటు సాగిన ఫైనల్లో తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచినప్పటికీ, విజయం కోసం ఫెదరర్ చెమటోడ్చాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 30, 2018, 12:09 [IST]
Other articles published on Jan 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+