న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకున్న ఆండీ ముర్రే

Andy Murray to miss 2020 Australian Open and ATP Cup because of pelvic injury

హైదరాబాద్: వచ్చే నెలలో జరిగే సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆండీ ముర్రే తప్పుకున్నాడు. పొత్తి కడుపు నొప్పితో బాధపడుతున్నందున ఈ గ్రాండ్ స్లామ్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు 32 ఏళ్ల ముర్రే ప్రకటించాడు.

తన కెరీర్‌లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన ఆండీ ముర్రే 12 నెలలు తర్వాత తన మొదటి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ఈవెంట్‌లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ గాయం కారణంగా టోర్నీ మిస్సవుతున్నట్లు తెలిపాడు. ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరి 20 నుంచి ఫిబ్రవరి 7ల తేదీ వరకు మెల్ బోర్న్ పార్క్‌లో జరగనుంది.

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ: ఈ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు జట్టుని ఎంపిక చేసిన పాంటింగ్కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ: ఈ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు జట్టుని ఎంపిక చేసిన పాంటింగ్

ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ మొదటిసారి 1905లో ప్రారంభమైంది. టెన్నిస్ ఆటలో ప్రతి ఏడాది గ్రాండ్‌స్లామ్‌గా పరిగణించే నాలుగు పోటీల్లో ఇదే మొదటిది. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ మిగతా మూడు పోటీలు. ఇందులో పురుషులకూ, మహిళలకూ సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్, జూనియర్స్ విభాగంలో నిర్వాహాకులు పోటీలను నిర్వహిస్తారు.

గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అన్నింటికన్నా ఎక్కువమంది అతిథులు హాజరైన టోర్నీగా ఆస్ట్రేలియన్ ఓపెన్ రికార్డు నెలకొల్పింది. వర్షం వచ్చినపుడూ, మరీ ఎక్కువగా ఎండగా ఉన్నపుడు పై కప్పుతో కూడిన మైదానాలు ఈ టోర్నీ ప్రత్యేకత ఆకర్షణ. ఇందులో రాడ్ లీవర్ ఎరీనా, హైసెన్స్ ఎరీనా, మార్గరెట్ ఎరీనా అని మూడు కోర్టులున్నాయి.

డబ్బు కోసం నా దేశాన్ని తాకట్టు పెట్టలేదు.. రక్తమోడుతున్నా బౌలింగ్ చేశా!!డబ్బు కోసం నా దేశాన్ని తాకట్టు పెట్టలేదు.. రక్తమోడుతున్నా బౌలింగ్ చేశా!!

కాగా, వచ్చే ఏడాది జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ స్టార్ ప్లేయర్లతో కళకళలాడనుంది. ఈ గ్రాండ్ స్లామ్ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను ఇటీవలే నిర్వాహాకులు విడుదల చేశారు. విక్టోరియా అజరెంకా మినహా పురుషులు, మహిళల విభాగంలో టాప్‌-50 ప్లేయర్లు ఈ టోర్నీలో పాల్గొననున్నారు. ఈ టోర్నీలో పురుషుల్లో అగ్రస్థానంలో ఉన్న స్పెయిన్ బుల్ రఫెల్‌ నాదల్‌, మహిళల్లో అగ్రస్థానంలో ఆష్లే బార్టీ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.

Story first published: Monday, December 30, 2019, 17:02 [IST]
Other articles published on Dec 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X