Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆఖరి టోర్నీ: కన్నీళ్లతో టెన్నిస్‌కు ముర్రే వీడ్కోలు

Andy Murray: The man who beat the greats

హైదరాబాద్: బ్రిటన్‌ స్టార్‌ ఆండీ ముర్రే టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో సుదీర్ఘ కాలంగా వేధిస్తున్న తుంటి గాయంతో ఈ మాజీ వరల్డ్‌ నంబర్‌వన్‌ టెన్నిస్ కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసిపోతోంది. సోమవారం ఆస్ట్రేలియన్‌ ఓపెన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 31 ఏళ్ల ముర్రే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత తాను రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించాడు.

సొంతగడ్డపై ఈ ఏడాది వింబుల్డన్‌ ఆడిన తర్వాత గుడ్‌బై చెప్పాలనుకున్నానని, అయితే అప్పటి వరకు తాను నొప్పితో ఆడలేనని ఈ సందర్భంగా అన్నాడు. రిటైర్మెంట్‌ ప్రకటన సందర్భంగా ముర్రే కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ముర్రే మాట్లాడుతూ "నా పరిధుల మేరకే ఇన్నాళ్లూ ఆడుతూ వస్తున్నా. కానీ గాయాల నొప్పిని భరించలేకపోతున్నా. తుంటి గాయం చాలా బాధపెడుతోంది" అని అన్నాడు.

శ్రద్ధ పెట్టలేకపోతున్నా

శ్రద్ధ పెట్టలేకపోతున్నా

"అందుకే శిక్షణలో కానీ టోర్నీల్లో కానీ పాల్గొనలేకపోతున్నా. ఏదోలా ఓర్చుకుంటూ కొంత వరకు ఆడగలనేమో. కానీ అంత సహనంతో బాధను భరిస్తూ ప్రాక్టీస్‌లో గానీ పోటీల్లో గానీ శ్రద్ధ పెట్టలేకపోతున్నా. చివరిగా వింబుల్డన్‌ టోర్నీలోనే ఆడా. ఆ టోర్నీతోనే కెరీర్‌ ముగిద్దామనుకున్నా. కానీ అక్కడ వరకు ఆటను కొనసాగించే పరిస్థితి లేదు. కాబట్టి ఇదే నా ఆఖరి టోర్నీ కావచ్చు" అని ముర్రే ఉద్వేగంగా పేర్కొన్నాడు.

మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన ముర్రే

మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన ముర్రే

ఆండీ ముర్రే తన కెరీర్‌లో మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గాడు. 1936లో ఫ్రెడ్‌ పెర్రీ వింబుల్డన్‌ గెలిచిన తర్వాత బ్రిటన్‌ అభిమానులు మళ్లీ టైటిల్‌ సాధించే తమ దేశపు ఆటగాడి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు 2013లో సొంతగడ్డపై వింబు ల్డన్‌ గెలిచి ముర్రే 77 ఏళ్ల కల నెరవేర్చాడు.

ఏకైక ఆటగాడు

ఏకైక ఆటగాడు

2012లో యుఎస్‌ ఓపెన్‌ గెలిచిన ముర్రే.. మరో మూడేళ్లకు 2016లో వింబుల్డన్‌తో పాటు ఫ్రెంచ్‌ ఓపెన్‌నూ కైవసం చేసుకున్నాడు. అంతేకాదు... వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో (2012, 2016) అతను స్వర్ణ నెగ్గి ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 2016 నవంబర్‌ 7 నుంచి వరుసగా 37 వారాల పాటు వరల్డ్‌ నంబర్‌వన్‌గా కొనసాగాడు.

గాయాలతో కనుమరుగు

గాయాలతో కనుమరుగు

ఆ తర్వాత గాయాలతో కనుమరుగైన ముర్రే.. మళ్లీ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించలేకపోయాడు. 2018లో యుఎస్‌ ఓపెన్లో మాత్రమే పాల్గొన్న ముర్రే... రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ఇక, ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో ఏకంగా ఐదుసార్లు ఫైనల్‌ చేరినా టైటిల్‌ గెలవలేకపోయాడు. ముర్రే ఖాతాలో మొత్తం 45 ఏటీపీ టైటిల్స్‌ ఉన్నాయి.

Story first published: Saturday, January 12, 2019, 11:35 [IST]
Other articles published on Jan 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+