అగస్సీని పెళ్లాడి తప్పు చేశా: నటి బ్రూక్ షీల్డ్స్
న్యూయార్క్: టెన్నీస్ మాజీ దిగ్గజం ఆండ్రూ అగస్సీ(44)ని వివాహం చేసుకోవడం పట్ల ప్రముఖ అమెరికా నటి బ్రూక్ షీల్డ్స్(44) విచారం వ్యక్తం చేశారు. ఆమె రాసిన 'దేర్ వాస్ ఏ లిటిల్ గర్ల్' అనే పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తాను అగస్సీని వివాహం చేసుకుని తప్పు చేశానని, తమ వైవాహిక సంబంధంపై తనకు ఎప్పుడూ సందేహంగానే ఉండేదని పీపుల్ మేగాజైన్‌లో వివరించారు. కాగా, వివాహమైన రెండేళ్లకు 1999లో అగస్సీతో విభేదాలు రావడంతో బ్రూక్ షీల్డ్స్ వేరుగా ఉంటున్నారు. తన వివాహం తన స్వేచ్ఛను దూరం చేసిందని బ్రూక్ పేర్కొన్నారు.

'అతడ్ని(అగస్సీ) వివాహం చేసుకోవడం నేను చేసిన తప్పు. వివాహం తర్వాత రెండేళ్ల వరకు తాము అరుదుగా ఒకరినొకరం కలుసుకున్నాం. నేను నా షోల పని నిమగ్నవగా.. అతను తన టోర్నమెంట్లతో బిజీగా ఉన్నారు. అతను టోర్నమెంటుల్లో ఓడిపోయినప్పుడు నన్ను నిందించేవాడు. దీంతో తనతో దూరంగా ఉండాలని నిశ్చియించుకున్నా' అని బ్రూక్ షీల్డ్స్ తెలిపారు.
తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు షీల్డ్స్ చెప్పారు. డ్రగ్స్‌కు అలవాటుపడిన అగస్సీ పట్ల తనకు అసంతృప్తి నెలకొందని తెలిపారు. 1993 నుంచి అతనితో డేటింగ్ చేసిన షీల్డ్స్.. అగస్సీ వ్యవహారశైలి పట్ల సంతోషంగా లేనని చెప్పారు.
'నేను అతనికి ఎలాంటి ఆంక్షలు లేకుండా మద్దతు తెలిపాను. అతను బట్ట తల కారణంగా విగ్గు ధరించేవాడు' అని తెలిపింది. తాను ఇప్పటికీ అతని మంచి కోరుకుంటున్నానని, అతనికి పెద్ద సలహాదారునని బ్రూక్ షీల్డ్స్ పేర్కొన్నారు. 2001లో క్రిస్ హెంచీని బ్రూక్ షీల్డ్స్ వివాహం చేసుకోగా, అగస్సీ మరో టెన్నిస్ తార స్టెఫ్ఫీ గ్రాఫ్‌ను పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications