Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Anam Mirza: యూపీఐ యాప్స్‌కి గుడ్‌బై.. సానియా మీర్జా సోదరి సరికొత్త పొదుపు చిట్కా

Sania Mirza Sister Anam Mirza: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె యూపీఐ యాప్‌లను ఉపయోగించడం పూర్తిగా మానేశానని చెబుతున్నారు.

అనమ్ మీర్జా చెప్పిన డబ్బు ఆదా చిట్కా ఇదే..
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జా సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. ఆమె తరచుగా తన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో తాను యూపీఐ యాప్‌లను పూర్తిగా ఉపయోగించడం మానేశానని చెబుతున్నారు. ఈ వీడియోలో ఆమె అందరికీ డబ్బు ఆదా చేయడానికి ఒక సులభమైన మార్గాన్ని వివరిస్తున్నారు.

Anam Mirza Quits UPI Apps Sania Mirza s Sister Shares Unique Money-Saving Strategy

యూపీఐను ఉపయోగించడం ఆపివేసి, గూగుల్ పేను తొలగించడం ద్వారా తాను ఖర్చులను ఎలా నియంత్రించుకుంటున్నానో అనమ్ మీర్జా వీడియోలో వివరించారు. "నేను గూగుల్‌ పేను ఉపయోగించడం మానేశాను. యూపీఐ లేదు, తక్షణ చెల్లింపులు లేవు. ఈ సంవత్సరం నేను యూపీఐ ఖాతాను ఖాళీ చేశాను. నా యూపీఐ యాప్‌లను తొలగించాను. బ్యాలెన్స్ లేదు. స్కాన్ చేయడానికి ఏమీ లేదు. మొదట్లపో ఇబ్బంది పడ్డాను. నేను చాలా సార్లు కార్డు లేదా నగదు లేకుండా కేఫ్‌లకు వెళ్లాను. నా స్నేహితులను కాఫీ కొనమని అడిగాను. నిజం చెప్పాలంటే పర్సు పట్టుకొని వెళ్లడం ఎలా ఉంటుందో మనమందరం మర్సిపోయాం. సమయం గడుస్తున్న కొద్దీ అనవసరంగా ఖర్చు చేయడం లేదని నేను గ్రహించాను" అని అనమ్ మీర్జా చెప్పారు.

"నగదు, కార్డుతో చెల్లించడం ఖర్చు చేసినట్లు అనిపిస్తుంది. యూపీఐ దానిని చాలా సులభతరం చేసింది. చిన్న మార్పులతో నేను ఎక్కడ ఖర్చు చేశానో తెలుసుకోవడం మొదలుపెట్టాను. "నో యూపీఐ లైఫ్" అంటే ఎక్కువ నియంత్రణ, తక్కువ అపరాధ భావన. చిన్న మార్పులు పెద్ద ప్రభావాన్ని చూపుతాయి" అని అనమ్ మీర్జా పేర్కొన్నారు.

అనమ్ మీర్జా ఏం చేస్తారంటే?
అనమ్ మీర్జా సోదరి సానియా మీర్జా గురించి అందరికీ తెలుసు. సానియా మీర్జా టెన్నిస్‌లో చాలా పేరు సంపాదించారు. అయితే అనమ్ మీర్జా తనకంటూ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తింపు పొందారు. ఆమెకు లేబుల్ బజార్ అనే సొంత ఫ్యాషన్ బ్రాండ్ ఉంది. అనమ్ మీర్జా 2016లో అక్బర్ రషీద్‌ను వివాహం చేసుకున్నారు. వారు 2018లో విడిపోయారు. ఆ తర్వాత అనమ్ మీర్జా భారత దిగ్గజ క్రీడాకారుడు మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు మహ్మద్ అసదుద్దీన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు దువా అనే ఒక కుమార్తె కూడా ఉంది.

Story first published: Thursday, June 26, 2025, 17:40 [IST]
Other articles published on Jun 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+