డబ్బులిస్తేనే దేశం తరఫున ఆడతానని నగాల్ డిమాండ్: ఏఐటీఏ
డేవిస్ కప్‌లో దేశం తరఫున ఆడేందకు భారత్ టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ డబ్బులు డిమాండ్ చేశాడని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) వెల్లడించింది. మరోవైపు ఈ విషయాన్ని సుమిత్ నగాల్ అంగీకరించాడు. అయితే స్టాండర్ట్ ప్రాక్టీస్ కోసమే అడిగినట్లు నగాల్ వివరణ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే..
గాయమని అబద్ధం చెప్పి డేవిస్ కప్‌కు సుమిత్ నగాల్ దూరమయ్యాడని ఏఐటీఏ ప్రధాన కార్యదర్శి అనిల్ ధూపర్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. వెన్ను నొప్పి కారణంతో నగాల్ డేవిస్ కప్‌ను ఆడలేదని, కానీ ఇప్పుడు చైనాలో ఆడటానికి అతను సిద్ధమయ్యాడని ధూపర్ అన్నాడు. తాజాగా అనిల్ ధూపర్.. సుమిత్ నగాల్ గురించి మరోసారి కీలక విషయాలు చెప్పాడు.

''డేవిస్ కప్ ఆడటానికి సుమిత్ నగాల్ వార్షిక ఫీజుగా సుమారు రూ.45 లక్షలు (50 వేల డాలర్లు) చెల్లించాలని డిమాండ్ చేశాడు. దేశం తరఫున ఎవరైనా ఆడేందకు ఇలా డబ్బులు డిమాండ్ చేస్తారా? చెల్లింపులు జరగలేదు కాబట్టే, నగాల్ ఆడలేదు. దీని గురించి దేశం తెలుసుకోవాలి. టాప్స్ ద్వారా కూడా ప్లేయర్లకు నిధులు అందుతుంటాయి. డేవిస్‌కప్‌లో ఆడినందుకు కూడా వాళ్లకు డబ్బులొస్తాయి''
''ప్రపంచకప్ గ్రూప్ 1లో ఆడితే ఐఏటీఏకు రూ.30 లక్షలు వస్తాయి. అందులో 70 శాతం ఆటగాళ్లకు పంచుతాం. మిగిలిన 30 శాతం మాత్రమే ఐఏటీఏ వద్ద ఉంటాయి. మరే ఇతర ఆటగాడు కూడా తమ వాటా నగదు బహుమతి కన్నా ఎక్కువ అడగలేదు'' అని అనిల్ ధూపర్ పేర్కొన్నాడు. కాగా, ఏఐటీఏ వ్యాఖ్యలపై సుమిత్ నగాల్ స్పందించాడు. ఫీజు అడిగిన మాట వాస్తమమే అని తెలిపాడు.
ఆటగాళ్లు సన్నద్ధమయ్యేందుకు ఖర్చులెన్నో ఉంటాయని, ఆ దృష్ట్యానే స్టాండర్డ్ ప్రాక్టీస్ కోసమే అడిగానని సుమిత్ నగాల్ పేర్కొన్నాడు. దేశం తరఫున ఆడటం గర్వకారణమని, కానీ వెన్నునొప్పి కారణంతోనే డేవిస్ కప్‌కు, తాజాగా చైనా ఓపెన్‌కూ దూరమయ్యానని నగాల్ తెలిపాడు. డబ్బుల కోసమే అనేది అవాస్తమని అన్నాడు. ఇటీవల స్వీడన్‌తో జరిగిన డేవిస్ కప్ గ్రూప్-1 టై పోరుకు నగాల్ గాయం కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు డేవిస్ కప్ పాకిస్థాన్ పోరుకు కూడా దూరమయ్యాడు.
అయితే సింగిల్స్ టాప్ ప్లేయర్లు సుమిత్ నగాల్, యుకి బాంబ్రి దూరమవ్వడంతో స్వీడన్‌తో జరిగిన పోరులో డబుల్స్ ఆటగాళ్లు శ్రీరామ్ బాలాజీ, రామ్‌కుమార్ రామనాథన్ సింగిల్స్‌లో ఆడాల్సి వచ్చింది. ఇది జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపించింది. స్వీడన్ చేతిలో ఇండియా 0-4తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లో బాలాజి, రామ్‌కుమార్ ఓటమి చవిచూశారు. ఒక్క సెట్ కూడా గెలవలేకపోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications