న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్‌టౌన్‌లో ఘనస్వాగతం: కెనడాలో ఓ వీధికి యుఎస్ ఓపెన్ విజేత పేరు

After US Open triumph, Bianca Andreescu has a day and street named after her

హైదరాబాద్: ఇటీవలే యుఎస్ ఓపెన్ నెగ్గిన బియాంక ఆండ్రెస్కుకు అరుదైన గౌరవం లభించింది. తన సొంత‌టౌన్‌ మిస్సిసౌగాలోని ఓ వీధికి ఆమె పేరు పెట్టారు. గత ఆదివారం జరిగిన యుఎస్ ఓపెన్ ఫైనల్లో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌పై బియాంక ఆండ్రెస్కు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

<strong>ధోని ప్యూచర్‌పై కోహ్లీ, సెలక్టర్లే నిర్ణయం తీసుకోవాలి</strong>ధోని ప్యూచర్‌పై కోహ్లీ, సెలక్టర్లే నిర్ణయం తీసుకోవాలి

యుఎస్ ఓపెన్ నెగ్గిన తొలి కెనడా క్రీడాకారిణిగా

యుఎస్ ఓపెన్ నెగ్గిన తొలి కెనడా క్రీడాకారిణిగా

ఫలితంగా యుఎస్ ఓపెన్ నెగ్గిన తొలి కెనడా క్రీడాకారిణిగా బియాంక ఆండ్రెస్కు చరిత్ర సృష్టించింది. 15వ సీడ్‌గా బరిలోకి దిగిన బియాంక ఆండ్రెస్కుకు ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. అంతకముందు వరకు ఓ గ్రాండ్‌స్లామ్‌లో రెండో రౌండ్‌ కూడా దాటని బియాంక.. యూఎస్ ఓపెన్‌ టైటిల్‌ను నెగ్గి అనేక రికార్డులు సృష్టించింది.

మహిళల సింగిల్స్‌లో

మహిళల సింగిల్స్‌లో గ్రాండ్‌స్లామ్‌ను అందుకున్న తొలి కెనడా క్రీడాకారిణిగా బియాంకా రికార్డు సృష్టించడంతో పాటు గత 13 ఏళ్లలో టైటిల్‌ను అందుకున్న తొలి టీనేజర్‌గానూ అరుదైన ఘనత సాధించింది. గ్రాండ్ స్లామ్‌తో స్వదేశానికి చేరుకున్న బియాంకకు కెనడియన్లు ఘన స్వాగతం పలికారు. సోమవారం టొరొంటోలో 'బియాంక ఆండ్రెస్కు డే'ని నిర్వహించారు.

భారీగా హాజరైన కెనడియన్లు

ఈ కార్యక్రమానికి భారీగా కెనడియన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా టొరొంటో మేయర్ జాన్ టోరీ మాట్లాడుతూ బియాంకకు ధన్యవాదాలు తెలిపాడు. తన ఆటతో ఎంతో మంది యువ అథ్లెట్లకు ప్రేరణగా నిలిచారని కొనియాడాడు. టోరీ తన అధికారిక ట్విట్టర్‌లో "టొరొంటోని మిలియన్ల హృదయాలను గెలుచుకుంది" అంటూ కామెంట్ పోస్టు చేశాడు.

ప్రజలు ఘన స్వాగతం

అంతకముందు ఆదివారం యుఎస్ ఓపెన్ ట్రోఫీతో తన సొంతటౌన్‌కు చేరుకున్న బియాంకకు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం టొరొంటోలో జరిగిన కార్యక్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మిస్సిసౌగా మేయర్ నగరంలోని ఓ వీధికి 'ఆండ్రుస్కు వే' అనే పేరుని పెడుతున్నట్లు ప్రకటించారు.

Story first published: Tuesday, September 17, 2019, 13:16 [IST]
Other articles published on Sep 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X