
హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తన కుమారుడు ఇజాన్ మిర్జా మాలిక్‌కు సంబంధించిన ఓ చక్కటి ఫోటోని అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలో సానియా ఒడిలో కూర్చున్న ఆమె కుమారుడు ఇజాన్ మిర్జా మాలిక్ టెన్నిస్ రాకెట్ పట్టుకుని ఉన్నాడు. గతేడాది సానియా మిర్జా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇజాన్ మీర్జా మాలిక్‌తో కలిసి ప్రాక్టీస్ కోసం టెన్నిస్ కోర్టుకు వచ్చిన సానియా తన కుమారుడు టెన్నిస్ రాకెట్ పట్టుకుని ఉన్న ఫోటోని ట్విట్టర్‌లో పంచుకుంటూ ''ఈ రాకెట్ మీ కోసం కొంచెం పెద్దది కావచ్చు ఇజ్జీ'' అంటూ కామెంట్ పెట్టింది. తన కుమారుడు టెన్నిస్ బ్యాట్ పట్టుకోవడంతో సానియా మురిసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.