For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిసెంబర్‌లో టీపీఎల్ 2వ సీజన్: హైదరాబాద్‌లో టాలెంట్ హంట్!

2nd Edition of Tennis Premier League to be held in December

హైదరాబాద్: టెన్నిస్‌కు పెరుగుతున్న ప్రజాదరణను దృష్టిలో పెట్టుకుని దేశంలోని యువ ప్రతిభను వెలికి తీసేందుకు గాను టెన్నిస్ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) రెండో సీజన్‌ను శుక్రవారం ప్రకటించారు. డిసెంబర్ 12 నుంచి 15 వరకు జరగనున్న ఈ టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌కు ముంబై అంథేరీలోని స్పోర్ట్స్ క్లబ్ ఆతిథ్యమిస్తోంది.

మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో దేశ వ్యాప్తంగా 88 మంది టెన్నిస్ ప్లేయర్లు టైటిల్ కోసం పోటీ పడనున్నారు. ఈ లీగ్‌లో పాల్గొనే ముంబై జట్టు ఫ్రాంచైజీని భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ సొంతం చేసుకున్నారు. ఇక, బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే సైతం ఓ ఫ్రాంచైజీకి యజమానిగా ఉన్నారు.

2nd Edition of Tennis Premier League to be held in December

టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనే ఎనిమిది జట్లలో పురుష ప్లేయర్ల(అండర్-14)తో పాటు మహిళా ప్లేయర్లు(అండర్-18) కూడా పాల్గొననున్నారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు గాను అండర్-18 విభాగంలో గర్ల్స్‌ను, అండర్-14 విభాగంలో అబ్బాయిలను ఎంపిక చేయనున్నారు.

ఇందు కోసం దేశంలోని నాలుగు సిటీల్లో టాలెంట్ హంట్స్‌ను నిర్వహించనున్నారు. అహ్మదాబాద్, ముంబై నగరాల్లో టాలెంట్ హంట్స్‌ను అక్టోబర్ 20 నుంచి 23 మధ్యలో నిర్వహిస్తుండగా... హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో నవంబర్ 3 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు.

2nd Edition of Tennis Premier League to be held in December

టాలెంట్ హంట్స్ కోసం ముందుగా ప్లేయర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 5 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని టెన్నిస్ ప్రీమియర్ లీగ్ నిర్వాహాకులు సూచించారు. మాజీ ప్లేయర్ కునాల్ థాకుర్ ప్రతిష్టాత్మంకగా తీసుకొచ్చిన టెన్నిస్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ పెద్ద సక్సెస్ అయింది.

ఈ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సక్సెస్ అవడంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్, జాతీయ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ ముఖ్య భూమిక పోషించారు. ఈ లీగ్ విజేతకు రూ.60 లక్షలు ప్రైజ్ మనీని ఇవ్వనున్నారు.

Story first published: Friday, August 2, 2019, 17:12 [IST]
Other articles published on Aug 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+