లారెస్ స్పోర్ట్స్ అవార్డులు: జొకోకు నాలుగోసారి, భారత్‌కు ఓ అవార్డు

హైదరాబాద్: వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ మరో అరుదైన ఘనత సాధించాడు. 2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం లారెస్ 'వరల్డ్ స్పోర్ట్స్ మన్ ఆఫ్ ద ఇయర్'ను సొంతం చేసుకున్నాడు. అతను ఈ అవారున్డు గెలుచుకోవడం నాలుగోసారి.
జమైకా స్పింటర్ ఉసేన్ బోల్ట్ రికార్డును జొకోవిచ్ సమం చేయగా... స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఐదు లారెస్ అవార్డులతో అగ్రస్థానంలో ఉన్నాడు. గతేడాది వింబుల్డన్, యుఎస్ ఓపెన్ సాధించడంతో పాటు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరిన జొకోవిచ్ ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను నెగ్గిన సంగతి తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా 68 మంది సభ్యులతో
ప్రపంచ వ్యాప్తంగా 68 మంది సభ్యుల లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అకాడమీ 2018లో సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుంటూ విజేతలను ఎంపిక చేసింది. ఇక, మహిళల విభాగంలో అమెరికాకు చెందిన ప్రపంచ మేటి జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ ‘స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు ఎంపికైంది. గతేడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలిచినందుకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది.

గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ సొంతం
గొప్పగా పునరాగమనం చేసిన వారికిచ్చే ‘వరల్డ్ కమ్ బ్యాక్ ఆఫ్ ద ఇయర్' అవార్డు గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ సొంతం చేసుకున్నాడు. ఐదేళ్ల విరామం తర్వాత అతను టూర్ చాంపియన్‌షిప్ సాధించడం విశేషం. ఈ విభాగంలో నామినేట్ అయిన భారత స్టార్ రెజ్లర్ వినీశ్ ఫొగాట్‌కు నిరాశ తప్పలేదు. రియో ఒలింపిక్స్‌లో తీవ్రంగా గాయపడిన వినేశ్... ఆ తర్వాత కోలుకొని గత ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించడంతో ఈ అవార్డుకు నామినేట్ అయింది.

‘టీమ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు ఫ్రాన్స్‌కు
ఇక, ‘టీమ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు ‘ఫిఫా' ప్రపంచ కప్ గెలుచుకున్న ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టుకు లభించింది. టెన్నిస్‌లో మహిళల వరల్డ్ నంబర్‌వన్ నయోమి ఒసాకా (జపాన్)కు ‘బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్' అవార్డు లభించింది. తొలిసారి యుఎస్ ఓపెన్ టైటిల్ గెలిచే క్రమంలో దిగ్గజ క్రీడాకారిణి సెరెనాపై ఫైనల్లో విజయం సాధించడంతో ఆమెను ఈ అవార్డు వరించింది.

‘ప్రత్యేక ఘనత' అవార్డుతో కిప్‌జోగె సత్కరించిన కమిటీ
మారథాన్‌లో ప్రపంచ రికార్డు (2 గంటల 1.39 నిమిషాలు) నెలకొల్పిన ఇలియుడ్ కిప్‌జోగె (కెన్యా)ను లారెస్ ‘ప్రత్యేక ఘనత' అవార్డుతో సత్కరించింది. 22 ఏళ్ల పాటు ఫుట్‌బాల్ క్లబ్ అర్సెనల్‌కు మేనేజర్‌గా వ్యవహరించిన ఆర్సెన్ వెంగర్‌కు ‘లైఫ్ టైం అచీవ్‌మెంట్' అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications