Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గాయాల కారణంగా విండీస్‌ టెస్టు నుండి జహీర్‌, శ్రీశాంత్‌ ఔట్‌

Sreesanth-Zaheer Khan
టీమిండియా ప్రధాన పేసర్‌ జహీర్‌ఖాన్‌.. మరో పేసర్‌ శ్రీశాంత్‌లు గాయాల కారణంగా టెస్ట్‌ సీరీస్‌ నుండి వైదొలిగారు. ఇంతకుముం దు ప్రకటించిన 16 మందితో కూడిన టెస్ట్‌ జట్టుకు జహీర్‌ ఖాన్‌, శ్రీశాంత్‌లు ఎంపికైన విషయం తెలిసిందే. అయితే.. అర్ధంతరంగా వీరిద్దరూ గాయపడడంతో.. ఈ నెల 20 నుండి కింగ్‌స్టన్‌ వేదికగా ప్రారంభమయ్యే టెస్ట్‌ మ్యాచ్‌ల కు అందుబాటులో ఉండడం లేదు. జహీర్‌ ఖాన్‌ కుడికాలి మడమ గాయంతో బాధపడుతుండగా.. శ్రీశాంత్‌ ఎల్బో ఇంజ్యూరీతో జట్టుకు దూరమయ్యాడు. వీరి స్థానాల్లో అభిమన్యు మిథున్‌, ప్రవీణ్‌ కుమార్‌లు ఎంపికయ్యారు. ''త్వర లో వెస్టిండీస్‌తో జరగబోయే టెస్ట్‌ సీరీస్‌ నుండి జహీర్‌ ఖాన్‌, శ్రీశాంత్‌ లు వైదొలిగారు.

జహీర్‌ ఖాన్‌ మడమ గాయంతో.. శ్రీంశాంత్‌ ఎల్బో తో బాధపడుతున్నారు. వీరి ద్దరికీ కొంతకాలం విశ్రాంతి అవసరం"" అని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే.. వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌లు గాయాలబారిన పడి టెస్ట్‌ సీరీస్‌కు దూరమవ్వగా.. సచిన్‌ టెండూల్కర్‌ సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రధాన బౌలర్లు ఇద్దరూ వైదొలగడంతో.. టీమిండియా మరింత బలహీనపడింది. కాగా.. ప్రస్తుత వన్డే సీరీస్‌లో పాల్గొనకుండా జహీర్‌ విశ్రాంతి తీసుకోగా.. శ్రీశాంత్‌ వన్డే సీరీస్‌కు ఎంపిక కాలేదు. అయితే.. గాయాలతో బాధపడుతూ కూడా ఐపీఎల్‌లో పాల్గొన్న సెహ్వాగ్‌, గంభీర్‌ లు అంతర్జాతీయ సీరీస్‌లకు మాత్రం విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు ప్రధాన బౌలర్లు కూడా అదే దారిని అనుసరించడంతో.. క్లబ్‌ వర్సెస్‌ కంట్రీ చర్చ మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

జహీర్‌ ఖాన్‌ ఇటీవలికాలంలో తరుచూ గాయపడుతూ.. ప్రధాన సీరీస్‌లను మిస్సవుతున్నాడు. గత సంవత్సరం భుజం గాయంతో.. శ్రీలంక టూర్‌కు వెళ్లలేకపోయిన జహీర్‌ను తొడ గాయంతో బాధపడుతున్నప్పటికీ.. ప్రపంచకప్‌కు ముందు జరిగిన.. న్యూజీలాండ్‌, దక్షిణాఫ్రికా సీరీస్‌లకు మాత్రం బలవంతంగా ఎంపిక చేశారు. ప్రపంచకప్‌లో 21 వికెట్లు తీసీ అగ్రస్థానంలో నిలిచిన జహీర్‌ ఆ తరువాత ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ప్రధాన బౌలర్‌ పేసర్‌గా ఆడాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+