న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అట్టహాసంగా యూత్ ఒలింపిక్స్ ప్రారంభం: తొలిరోజే బోణి కొట్టిన భారత్

Youth Olympics 2018 : Buenos Aires 2018 Kicks Off With A Record Crowd
Youth Olympcs: Buenos aires 2018 kicks off with a record crowd

హైదరాబాద్: అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌ వేదికగా 3వ యూత్‌ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. అయితే, రొటీన్‌కు భిన్నంగా జరిగిన ఈ ఆరంభ వేడుకలు వీక్షకులను ఆద్యంతం అద్భుతంగా ఆకట్టుకున్నాయి. బహిరంగంగా ఈ జరిగిన వేడుకలను వీక్షించడానికి రికార్డుస్థాయిలో రెండు లక్షల మంది హాజరయ్యారు.

అంగరంగ వైభవంగా ఆరంభ వేడుకలు

అంగరంగ వైభవంగా ఆరంభ వేడుకలు

ఈ ఆరంభ వేడుకల్లో భారత్ తరుపున యువ షూటర్‌ మను భాకర్‌ పతాకధారిగా భారత బృందాన్ని ముందుండి నడిపించింది. ఈ ఏడాది ఆగస్టులో థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డ బాలుర ఫుట్‌బాల్‌ టీమ్‌ ‘వైల్డ్‌ బోర్‌' ఆరంభోత్సవంలో పాల్గొనడం వేడుకలకు హైలైట్‌గా నిలిచింది. మొత్తం 12 రోజులపాటు జరిగే గేమ్స్ అక్టోబర్ 18న ముగుస్తాయి.

 ఫేవరెట్‌‌గా మను భాకర్‌

ఫేవరెట్‌‌గా మను భాకర్‌

మొత్తం 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న 206 జట్లకు చెందిన నాలుగు వేల మంది అథ్లెట్లు ఈ యూత్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొననున్నారు. భారత్‌ తొలిసారి 68 మంది సభ్యులున్న భారీ బృందాన్ని ఈ యూత్ ఒలింపిక్స్‌కు పింది. ఇందులో 48 మంది అథ్లెట్లు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో విభాగంలో 16 ఏళ్ల భాకర్‌ ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతున్నారు.

 తొలిరోజు బోణి కొట్టిన భారత్

తొలిరోజు బోణి కొట్టిన భారత్

కాగా, యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ కొట్టింది. తొలిరోజే భారత్ ఖాతాలో రెండు పతకాలు వచ్చి చేరాయి. ఆదివారం మొదలైన ఈ క్రీడల్లో భారత షూటర్‌ తుషార్‌ మానె రజత పతకం సాధించాడు. పురుషుల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో తుషార్‌ ఫైనల్లో 247.5 స్కోరు చేసి రెండోస్థానంలో నిలిచాడు. రష్యా షూటర్‌ గ్రిగోరి షమకోవ్‌ (249.2) స్వర్ణం సాధించగా, అలెక్స్‌ మిట్రోవిచ్‌ (సెర్బియా)కు కాంస్యం దక్కింది.

రజతం నెగ్గిన తుషార్‌ మానె

రజతం నెగ్గిన తుషార్‌ మానె

జూడోలో ఫైనల్‌కు దూసుకెళ్లిన తబాబి దేవి(44 కేజీలు) కనీసం రజతం ఖాయం చేసింది. బ్యాడ్మింటన్‌లో తెలుగమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి సింగిల్స్‌లో రెండోరౌండ్‌ చేరింది. వైష్ణవి 21-13, 21-6తో ఎలెనా (స్పెయిన్‌)పై గెలిచింది. పురుషుల హాకీ తొలి మ్యాచ్‌లో భారత జట్టు 10-0 గోల్స్‌ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. గత యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఒక రజతం, ఒక కాంస్యం మాత్రమే గెలిచింది.

Story first published: Monday, October 8, 2018, 12:57 [IST]
Other articles published on Oct 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X