అబుదాబి: సుదీర్ఘ కాలంగా చెక్కు చెదరకుండా ఉన్న మాజీ ఆటగాడు జావేద్ మియాందాద్ రికార్డును యూనిస్ ఖాన్ బద్దలు కొట్టాడు. షేక్ జాయేద్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచులో యూనిస్ ఖాన్ ఈ ఘనత సాధించాడు.
పాకిస్థాన్ టెస్ట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా యూనిస్ ఖాన్ మంగళవారం తన పేరును నమోదు చేసుకున్నాడు. యూనిస్ ఖాణ్ ఈ ఘనత సాధించిన అనంతరం స్టేడియంలోని పాక్ ఆటగాళ్లు, అభిమానులు లేచి నిల్చుని అభినందించారు.
యూనిస్ ఖాన్ తన 102లో టెస్ట్ మ్యాచులో బౌండరీతో 20ఏళ్ల మియాందాద్ రికార్డును బ్రేక్ చేశాడు. 1993, డిసెంబర్‌లో మియాందాద్ రిటైరయ్యాడు. కాగా, అతని రికార్డు మాత్రం 22ఏళ్ల పాటు అతని పేరునే ఉండిపోయింది.
124 టెస్టుల్లో 8,832 పరుగులు చేసిన మియాందాద్ రికార్డును పాకిస్థాన్ నుంచి అత్యధిక శతకాలు(30) నమోదు చేసిన యూనిస్ ఖాన్ తుడిచేశాడు. యూనిస్ ఖాన్ 2000 ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన అంతర్జాతీయ టెస్ట్ మ్యాచుతో అరంగేట్రం చేశాడు.

పాకిస్థాన్ తరపున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్లు
యూనిస్ ఖాన్-8,836(22 పరుగుల వద్ద ఆడుతున్నప్పుడు, 102వ టెస్ట్)
జావేద్ మియాందాద్-8,832(124 టెస్టులు)
ఇంజమాముల్ హక్-8,829(119 టెస్టులు)
మహ్మద్ యూసుఫ్-7,530(90 టెస్టులు)
సలీం మాలిక్-5,768(103టెస్టులు)
పాక్ తరపు అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్లు
30 - యూనిస్ ఖాన్
25 - ఇంజమాముల్ హక్
24 - మహ్మద్ యూసుఫ్
23 - జావేద్ మియాందాద్
15 - సలీం మాలిక్