28ఏళ్లకు స్వర్ణం: దత్ ఇలా పడేసి గెలిచాడు(పిక్చర్స్)
ఇంచియాన్: ఆసియాడ్‌లో తొమ్మిదో రోజు భారత్ స్వర్ణంతో సహా 8 పతకాలు సాధించింది. రెజ్లింగ్‌లో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఆసియా గేమ్స్‌లో 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ యోగేశ్వర్ దత్ 'పసిడి'పట్టు పట్టాడు. పురుషుల 65 కిలోల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో అతను తజకిస్తాన్ రెజ్లర్ జలీంఖాన్ యుసుపోవ్‌ను 3-0 తేడాతో చిత్తుచేసి, చిరస్మరణీయ టైటిల్‌ను అందుకున్నాడు.
2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన యోగేశ్వర్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌ను ప్రదర్శించడంతో యుసుపోవ్ అతనికి ఏ దశలోనూ గట్టిపోటీని ఇవ్వలేకపోయాడు. 1986 సియోల్ ఆసియా క్రీడల్లో కర్తార్ సింగ్ స్వర్ణ పతకం సాధించాడు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత భారత్‌కు మరో స్వర్ణాన్ని యోగేశ్వర్ అందించాడు. 2006 ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించిన అతను ఈసారి విజేతగా నిలవడం విశేషం.
1986 సియోల్ ఆసియాడ్‌లో భారత్ తరఫున కర్తార్ సింగ్ చివరిసారి రెజ్లింగ్ స్వర్ణం నెగ్గాడు. కాగా మహిళల ఫ్రీ స్టయిల్ 55 కిలోల కాంస్య పోరులో బబితా కుమారి 1-3తో జు చున్ జోంగ్ (చైనా) చేతిలో ఓడింది. ఇక పురుషుల 97 కిలోల కాంస్య ఫైట్‌లో సత్యవత్ కడియన్ 0-3తో ఇబ్రగిమోవ్ మమ్మద్ (కజకిస్థాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు.
'టాప్-10'లో భారత్
ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 'టాప్-10'లో స్థానం సంపాదించింది. శనివారం 11 పతకాలను సాధించిన భారత్‌కు ఆదివారం ఒక స్వర్ణం, ఒక రజతం, ఆరు కాంస్యాలు సహా మొత్తం ఎనిమిది పతకాలు లభించాయి. ప్రస్తుతం భారత్ నాలుగు స్వర్ణం, ఐదు రజతం, 26 కాంస్యాలతో మొత్తం 35 పతకాలు సాధించి తొమ్మిదో స్థానంలో నిలిచింది. చైనా 105 స్వర్ణం, 63 రజతం, 48 కాంస్యాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈసారి ఏషియాడ్‌కు ఆతిథ్యమిస్తున్న దక్షిణ కొరియా 42 స్వర్ణం, 48 రజతం, 47 కాంస్య పతకాలతో రెండో స్థానంలో ఉండగా, జపాన్ 34 స్వర్ణం, 46 రజతం, మరో 46 కాంస్య పతకాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

యోగేశ్వర్ దత్
రెజ్లింగ్‌లో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఆసియా గేమ్స్‌లో 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ యోగేశ్వర్ దత్ ‘పసిడి'పట్టు పట్టాడు.

యోగేశ్వర్ దత్
పురుషుల 65 కిలోల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో అతను తజకిస్తాన్ రెజ్లర్ జలీంఖాన్ యుసుపోవ్‌ను 3-0 తేడాతో చిత్తుచేసి, చిరస్మరణీయ టైటిల్‌ను అందుకున్నాడు.

యోగేశ్వర్ దత్
2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన యోగేశ్వర్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌ను ప్రదర్శించడంతో యుసుపోవ్ అతనికి ఏ దశలోనూ గట్టిపోటీని ఇవ్వలేకపోయాడు.

యోగేశ్వర్ దత్
1986 సియోల్ ఆసియా క్రీడల్లో కర్తార్ సింగ్ స్వర్ణ పతకం సాధించాడు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత భారత్‌కు మరో స్వర్ణాన్ని యోగేశ్వర్ అందించాడు.

యోగేశ్వర్ దత్
రెజ్లింగ్ విభాగంలో బంగారం పతకం సాధించిన అనంతరం మెడల్‌తో యోగేశ్వర్ దత్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications