Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'వీడ్కోలు చెప్పాల్సిన టైమ్ వచ్చేసింది.. ఇక ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వండి'

WWE legendary The Undertaker gets farewell at Survivor Series

హైదరాబాద్: వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (డబ్ల్యూడబ్ల్యూఈ)లో దిగ్గజ రెజ్లర్‌ 'ది అండర్‌టేకర్'‌ ఇక కనిపించరు. ఆల్‌టైమ్ గ్రేట్ రెజ్ల‌ర్ల‌లో ఒక‌డిగా నిలిచిన ది అండ‌ర్‌టేక‌ర్.. ఇక తాను గేమ్‌కు గుడ్‌బై చెప్పే టైమ్ వ‌చ్చేసింద‌ని చెప్పేశారు. స‌ర్వైవ‌ర్ సిరీస్‌లో అత‌ని స‌మ‌కాలీన లెజెండ‌రీ రెజ్ల‌ర్లంతా క‌లిసి అత‌నికి ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. గ‌త జూన్‌లోనే తాను రిటైరవుతున్న‌ట్లు అత‌డు ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. అండర్‌టేకర్ అసలు పేరు మార్క్‌ విలియం కలవే. యునైటెడ్‌ స్టేట్స్‌లోని టెక్సాస్‌లో అతడు జన్మించారు. రింగ్‌లో అండర్‌టేకర్‌గా ఫేమస్‌.

30 ఏళ్లుగా ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న 55 ఏళ్ల స్టార్ రెజ్లర్ 'ది అండర్‌టేకర్'‌ తన రింగ్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. 30 ఏళ్లుగా ఈ రింగ్‌లోకి నెమ్మదిగా న‌డుచుకుంటూ వ‌చ్చి ఎంతో మంది ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌ట్టిక‌రిపాను. ఇక ఇప్పుడు నేను వీడ్కోలు చెప్పాల్సిన టైమ్ వచ్చేసింది. ఈ 'ది అండ‌ర్‌టేక‌ర్'‌ను ఇక ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వండి అని త‌న రిటైర్మెంట్ స్పీచ్‌లో అండ‌ర్‌టేక‌ర్ అన్నారు. స‌ర్వైవ‌ర్ సిరీస్‌లో రోమ‌న్ రీన్స్‌, డ్రూ మెకింటైర్ మ్యాచ్ త‌ర్వాత డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ లెజెండ్స్ అంద‌రూ క‌లిసి వ‌చ్చి అండ‌ర్‌టేక‌ర్‌కు ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు.

షేన్ మెక్‌మ‌హ‌న్‌, బిగ్ షో, జేబీఎల్‌, జెఫ్ హార్డీ, మిక్ ఫోలీ, ది గాడ్‌ఫాద‌ర్‌, ది గాడ్విన్స్‌, సేవియో వెగా, రికిషి, కెవిన్ నాష్‌, బుక్ టీ, షాన్ మైకేల్స్‌, రిక్ ఫ్లెయిర్‌, ట్రిపుల్ హెచ్‌, కేన్ లాంటి లెజెండ్స్ అంద‌రూ రింగ్‌లోకి వ‌చ్చి అండ‌ర్‌టేక‌ర్ కెరీర్‌ను సెల‌బ్రేట్ చేసుకున్నారు. మార్క్‌ విలియం కలవే (అండ‌ర్‌టేక‌ర్) 1990లో రెజ్లింగ్‌లోకి వ‌చ్చారు. ఎన్నో అద్భుత విజయాలు సొంతం చేసుకున్నారు. 30 ఏళ్లుగా వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో ఓ సంచ‌ల‌నంగా మారిన అండ‌ర్‌టేక‌ర్ పేరు ఇక వినిపించ‌దు.

Story first published: Monday, November 23, 2020, 13:37 [IST]
Other articles published on Nov 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+