భారత మహిళా కోచ్‌గా రామన్ ఎవరో తెలుసుకోవాలనుందా?

ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్‌గా ఊర్కెరి వెంకట్ రామన్‌ను ఎంపిక చేసి అనేక ఉత్కంఠలకు తెరదించింది బీసీసీఐ. కాంపిటీషన్‌లో ఉన్న తాత్కాలిక కోచ్ రమేశ్ పవార్‌ను కాదని, భారత్‌కు రెండో ప్రపంచకప్ అందించిన గ్యారీ కిర్‌స్టన్‌ను కాదని బీసీసీఐ నియమించడానికి కారణాలు కోకొల్లలు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఎంతోమంది క్రికెటర్లను తీర్చిదిద్దిన అనుభవం రామన్ సొంతం. అంతేకాదు రంజీ జట్లకు శిక్షణనివ్వడంతో పాటు.. అండర్-19 క్రికెటర్లకూ ఆటలో ఓనమాలు దిద్దించారు.

అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఎక్కువగా
దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన ఎడమచేతి వాటం రామన్ అంతర్జాతీయ వేదికగా మాత్రం ప్లేయర్‌గాఅనుకున్నంత ఆకట్టుకోలేకపోయారు. దక్షిణాఫ్రికాలో వన్డేల్లో సెంచరీ బాదిన తొలి భారత ప్లేయర్‌గా ఆయన అందరికీ గుర్తుండిపోతారు.

క్లిష్టమైన తరుణంలో దన్నుగా నిలబడి
భారత క్రికెట్ జట్టు 1992, డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఏడు వన్డేల సిరీస్‌లో తలపడింది. 2-5 తేడాతో సిరీస్ చేజార్చుకుంది. తొలి 2 మ్యాచుల్లో 6 వికెట్ల తేడాతో ఓడింది. మూడో మ్యాచ్‌లో మాత్రం రామన్ చెలరేగారు. తొలుత సఫారీ జట్టు 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఛేదనలో టీమిండియా తడబడింది. ఆతిథ్య జట్టులో అలన్ డొనాల్డ్, క్రెయిగ్ మాథ్యూస్, ఫ్యానీ డివిలియర్స్, బ్రియాన్ మెక్‌మిలన్, డేవ్ కలాగన్ వంటి దుర్భేద్యమైన బౌలర్లు సవాల్ విసురుతున్నారు.

తడబాటు లేకుండా గెలుపే లక్ష్యంగా
అజయ్ జడేజా (20), రామన్ (114; 148 బంతుల్లో 6ఫోర్లు, 1సిక్సు) ఓపెనర్లుగా వచ్చారు. 56 పరుగుల వద్ద జడేజా పెవిలియన్ చేరాడు. 72 వద్ద ప్రవీణ్ ఆమ్రె (1), 123 వద్ద అజారుద్దీన్ (18), 168 వద్ద సచిన్ (22), 171 వద్ద కపిల్‌దేవ్ ఔటయ్యారు. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నా పరుగులు చేయడం ఆపలేదు రామన్. తడబాటు లేకుండా గెలుపే లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. ఒత్తిడితో జట్టు సతమతమవుతున్న తరుణంలో స్థిరంగా నిలిచి గెలిపించారు.

సెంచరీ పూర్తయ్యాక అవుట్
అప్పటికే సెంచరీ పూర్తి చేయడంతో జట్టు స్కోరు 194 వద్ద డొనాల్డ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. ఆ తర్వాత రవిశాస్త్రి (27 నాటౌట్), కిరణ్ మోరె (4) అజేయంగా నిలిచి జట్టుకు మంచి ముగింపు పలికారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన రామన్ దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సెంచరీ బాదిన భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. అంతర్జాతీయ క్రికెట్‌లో రామన్ 11 టెస్టులు, 27 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 25 సగటుతో 448, వన్డేల్లో 34 సగటుతో 614 పరుగులు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications