For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇల్లు గడవక పార్కింగ్ జోన్‌లో పనిచేస్తున్న మాజీ రెజ్లర్

Wrestling: His father works at a car-parking, Suraj Kant dreams of donning India shirts

హైదరాబాద్: జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం గెలుచుకోవాలని ఆశ పడుతున్న పేద రెజ్లర్ సూరజ్ కాంత్. అతని తండ్రి కూడా 40 సంవత్సరాల క్రితం గోరఖ్‌పూర్ ఓ రెజ్లర్. అప్పట్లో అతను చాలా ప్రఖ్యాతి గాంచిన రెజ్లర్. కానీ, కాలం కలిసిరాక ఆర్థికంగా పూర్తిగా నష్టపోయాడు. చివరికి కుటుంబాన్ని తీసుకుని ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమబెంగాల్‌కు వలస వెళ్లిపోయాడు. అక్కడ చిన్న కార్ పార్కింగ్ ప్రదేశంలో పనిచేసుకుంటూ బతుకుతున్నాడు.

అతను రెజ్లింగ్ మానేసినా అదే రక్తం పంచుకుపుట్టిన కొడుకు సూరజ్ కాంత్‌కు అదే అభిరుచి అబ్బింది. దాన్నే ధ్యేయంగా చేసుకుని ఐదేళ్ల వయస్సు నుంచి శిక్షణ మొదలుపెట్టాడు. నాన్నే గురువు. ఇంకేముంది, రాష్ట్ర స్థాయిలో ఎన్నో స్వర్ణాలు గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఈ 21సంవత్సరాల ఈ రెజ్లర్ 55కేజీల విభాగంలో జాతీయ స్థాయిలో ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.

ఒకసారి తన గ్రామస్థాయిలో జరుగుతున్న సమయంలో సూరజ్ పోటీల్లో పాల్గొన్నాడు. అందులో గెలుపొందగా అతనికి రూ.20,000 సొమ్మును నిర్వహకదారులు రివార్డును బహుకరించారు. అది తీసుకుని ఇంటికి వెళ్తే అతని తండ్రి గ్రామస్థాయిలో ఆడొద్దని వారించటంతో అప్పటి నుంచి అక్కడ ఆడటం మానేశాడు.

ప్రస్తుతమున్న రోజుల్లో కేవలం ప్రోత్సాహంతోనే పోటీలకు దిగడం అసాధ్యం. సరైన ఆహారం ఉండాలి. మెరుగైన శిక్షణ ఉండాలి. కానీ, ఇవేమి లేకపోయినా తన తండ్రినే ప్రేరణగా తీసుకుని సూరజ్ సాగిపోతున్నాడు. అతని తండ్రి రెజ్లర్ అయినా ఆర్థికంగా ఎదుగుదల ఉండదని తెలిసినా అదే రంగంలో కొనసాగుతున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 19, 2017, 15:55 [IST]
Other articles published on Dec 19, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+