రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా పలువురు స్టార్ రెజ్లర్లు నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వీళ్లు.. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ పదవికి అతను రాజీనామా చేశాడు. ఈ పదవిలో కొత్త వారిని నియమిస్తామని ప్రభుత్వం రెజ్లర్లకు హామీ ఇచ్చింది.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కోసం మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని, అయితే ఈ ఎలక్షన్లలో బ్రిజ్ భూషణ్‌తో సంబంధం ఉన్న వాళ్లెవరూ నిలబడకుండా చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం తెలిపింది. ఈ బాధ్యతను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)కి అప్పగించింది. ఈ ఎన్నికలను ఈ నెలాఖరులోగా నిర్వహిస్తామని క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.

కానీ కొన్ని విధానపరమైన పరిమితుల వల్ల అది జరగలేదు. అయితే జులై 6వ తేదీన ఎలక్షన్లు నిర్వహించాలని ఐఓఏ డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే ఓటర్ల లిస్టు తయారు చేసే పనిలో పడింది. దీనికోసం 2022లో డబ్ల్యూఎఫ్ఐ డిస్‌క్వాలిఫై చేసిన ఐదు రాష్ట్రాల బోర్డుల సభ్యులతో సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్‌లో అనుకున్న ఫలితం రాలేదని తెలుస్తోంది.
డిస్‌క్వాలిఫై అయిన బోర్డులే ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలని అభ్యర్థించాయి. తమ డిమాండులను ఐఓఏకు చెప్పుకున్నాయి. అయితే ఈ చర్చలు సఫలం కాలేదు. దీంతో ఓటర్ల జాబితాను తయారు చేయడం మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ఈ క్రమంలో మరోసారి ఈ బోర్డులతో సమావేశం అయిన తర్వాత జులై 11న ఎన్నికలు నిర్వహిస్తామని రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు.
డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్‌గా జమ్మూకశ్మీర్ హైకోర్టు మాజీ జడ్జి మహేష్ మిట్టల్ కుమార్‌ను ఐఓఏ నియమించిన సంగతి తెలిసిందే. ఆయనతో సమావేశం అవడానికి డిస్‌క్వాలిఫై అయిన బోర్డులు అభ్యర్థనలు పంపాయి. 2022లో మహారాష్ట్ర, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ రెజ్లింగ్ బాడీలను డబ్ల్యూఎఫ్ఐ డిస్‌క్వాలిఫై చేసింది. వీరితో మరోసారి రిటర్నింగ్ ఆఫీసర్ మీటింగ్ నిర్వహిస్తారని సమాచారం. ఆ తర్వాతే ఓటర్ల జాబితా రెడీ అవుతుంది.