Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఆశ నెరవేరదు: యోగేశ్వర్‌కు రజత యోగం లేనట్లే!

న్యూఢిల్లీ: లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత, రష్యన్ రెజ్లర్ బెసిక్ ఖుదుకోవ్ డోపీగా తేలడంతో అదే లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత స్టార్‌ రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌ కాంస్య పతకం రజతానికి అప్‌గ్రేడ్ కానుందని తెలిసి అంతా సంతోషించారు. అయితే ఆ ఆశ నెరవేరేలా కనిపించడం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వివరాల్లోకి వెళితే... 2012లో జరిగిన లండన్‌ ఒలింపిక్స్‌లో రష్యన్ రెజ్లర్‌ బెసిక్ ఖుదుకోవ్ చేతిలో యోగేశ్వర్‌ దత్‌ ఓటమి పాలయ్యాడు. అనూహ్యంగా ఖుదుకోవ్ ఫైనల్‌‌కు చేరడంతో రెపిఛేజ్‌ ద్వారా లభించిన అవకాశాన్ని యోగేశ్వర్ దత్ సమర్థంగా వినియోగించుకొని లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాడు

Wrestler Yogeshwar Dutt’s London Olympic bronze won't be upgraded to silver
.

ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) అధునాతక సాంకేతికను ఉపయోగిస్తూ బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన అథ్లెట్ల శాంపిల్స్‌ను మరోసారి పరీక్షించింది. ఈ పరీక్షల్లో 2013లో కారు ప్రమాదంలో మరణించిన ఖుదుకోవ్ విఫలమైనట్లు తేలింది. దీంతో యోగేశ్వర్ పతకం కాంస్యం నుంచి రజతానికి అప్‌గ్రేడ్ కానుందన్న వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా ఖుదుకోవ్‌పై దర్యాప్తును నిలిపివేసిందని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐవోసీ) క్రమశిక్షణ కమిటీ నిర్ణయించిందని రష్యా రెజ్లింగ్ సమాఖ్య మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఖుదుకోవ్‌ డోపీగా తేలే అవకాశాలు లేవని తెలుస్తోంది.

ఇది నిజమే!: యోగేశ్వర్‌కు 2012 ఒలింపిక్స్‌లో రజతం

నాలుగు సార్లు వరల్డ్ ఛాంపియన్, రెండు సార్లు ఒలింపిక్ మెడల్ సాధించిన ఖుదుకోవ్‌ 2013లో రష్యాలో జరిగిన ఓ కారు ప్రమాదంలో మరణించాడు. దీంతో యోగేశ్వర్ దత్ కాంస్య పతకం రజతంగా మారే అవకాశం ఉండదు. యోగేశ్వర్ ఇక కాంస్యంతోనే సరిపెట్టుకోక తప్పదు.

అయితే దీనిపై పూర్తి సమాచారం తమకు అందలేదని భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉంటే డోపింగ్ ఫలితాల్లో పాజిటివ్ అని తేలి ప్రస్తుతం మన మధ్యన లేనటువంటి రష్యన్ రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ రజత పతకాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు.

మానవత్వం చాటాడు: లండన్ రజతాన్ని తీసుకునేందుకు రెజ్లర్ యోగేశ్వర్ నో

'రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ మంచి రెజ్లర్. అయితే చనిపోయిన తర్వాత డోపింగ్ టెస్టులో విఫలమవడం దురదృష్టకరం. ఒక క్రీడాకారుడిగా నేను గౌరవిస్తున్నాను. ఇప్పటికే ఆ రెజ్లర్ ను కోల్పోయి కుదుఖోవ్ కుటుంబం ఎంతో బాధలో ఉండి ఉంటుంది. అందుకే ఆ రెజ్లర్ సాధించిన పతకాన్ని అతడి గౌరవార్థం ఆ కుటుంబం వద్దనే ఉండాలి. ఈ సమయంలో మనం మానవతాదృక్పథంతో నడుచుకోవాలి' అని గతంలో ట్విట్టర్‌లో స్పందించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+