Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సుశీల్ కుమార్ కు కాంస్య పతకం

Sushil Kumar
బీజింగ్: బీజింగ్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం వచ్చింది. పురుషుల 66 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో భారత క్రీడాకారుడు సుశీల్ కుమార్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కజిగిస్థాన్ కు చెందిన లియోనిడ్ స్పీరిదోనోవ్ ను ఓడించి సుశీల్ కుమార్ ఈ పతకాన్ని సాధించాడు. దీంతో భారత్ కు బీజింగ్ లో రెండు పతకం వచ్చింది. సుదీర్ఘ కాలం తర్వాత భారత్ కు ఒలింపిక్స్ లో రెండు పతకాలు వచ్చాయి.

ఒలింపిక్స్ లో భారత్ కు ఇది రెండో కాంస్య పతకం. ఖసాభా జాదవ్ 1952లో ఒలింపిక్స్ రెజ్లింగ్ లో కాంస్య పతకం సాధించాడు. ఎథెన్స్ ఒలింపిక్స్ లో సుశీల్ కు 14వ స్తనం లభించింది. 2007 ప్రపంచ చాంపియన్ షిప్ లో అతను ఏడో స్థానంలో నిలిచాడు.
Story first published: Wednesday, August 20, 2008, 15:42 [IST]
Other articles published on Aug 20, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+