న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics: డోపింగ్‌లో సుమిత్‌ మలిక్‌ విఫలం.. ఒలింపిక్స్‌ ఆశలు ఆవిరి!!

Wrestler Sumit Malik fails dope test, India to lose one Tokyo Olympics wrestling quota


ఢిల్లీ: మరికొద్ది రోజుల్లో ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం కానుండగా.. భారత్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. టోక్యో ఒలింపిక్స్‌లో తలపడాల్సిన హెవీవెయిట్‌ ఫ్రీస్టయిల్‌ రెజ్లర్‌ సుమిత్‌ మాలిక్‌ డోప్‌ టెస్ట్‌లో విఫలం కావడంతో అతడిపై తాత్కాలిక సస్పెన్షన్‌ విధించారు. బల్గేరియాలోని సోఫియాలో ఇటీవలే జరిగిన ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో సత్తాచాటి టోక్యో బెర్తు సంపాదించిన సుమిత్‌.. అక్కడే నిర్వహించిన డోప్‌ పరీక్షలో విఫలమయ్యాడు.

Brianna McNeal: ఒలింపిక్ విజేతపై ఐదేళ్ల నిషేధంBrianna McNeal: ఒలింపిక్ విజేతపై ఐదేళ్ల నిషేధం

2018 కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించి వెలుగులోకి వచ్చిన 28 ఏళ్ల సుమిత్‌ మలిక్‌.. బల్గేరియా క్వాలిఫయర్స్‌లో 125 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరడం ద్వారా ఒలింపిక్‌ బెర్తు సాధించాడు. కానీ మోకాలి గాయంతో అతడు తుదిపోరు నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం డోపీగా తేలడంతో సుమిత్‌ టోక్యో ఆశలకు దాదాపు తెరపడినట్టే. సుమిత్‌కు సంబంధించి 'బి' శాంపిల్‌ను కూడా పరీక్షించాల్సి ఉంది. అందులోనూ ఫలితం 'పాజిటివ్‌'గా వస్తే అతడిపై నిషేధం పడటం, ఒలింపిక్స్‌కు దూరం కావడం లాంఛనమే. ఒకవేళ సుమిత్‌ 'బి' శాంపిల్‌ కూడా పాజిటివ్‌ వస్తే అతనిపై కనీసం రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది.

మెగా టోర్నీకి ముందు డోప్‌ టెస్టులో విఫలమవడంతో సుమిత్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రపంచ రెజ్లింగ్‌ సమాఖ్య (యూడబ్ల్యూబ్ల్యూ) స్పష్టం చేసింది. 'యూడబ్ల్యూడబ్ల్యూ నుంచి గురువారం మెయిల్‌ అందింది. డోప్‌ టెస్టులో విఫలమైన సుమిత్‌ మాలిక్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. 'బి' శాంపిల్‌ రిజల్ట్‌ కోసం వేచిచూస్తున్నాం' అని భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) కార్యదర్శి వినోద్‌ తోమర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఒలింపిక్స్‌ ముంగిట ఓ రెజ్లర్‌ డోపీగా తేలడం ఇది తొలిసారి కాదు. 2016 రియో ఈవెంట్‌ ముంగిట కూడా నర్సింగ్‌ యాదవ్‌ డోప్‌ పరీక్షలో విఫలమైన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, June 5, 2021, 9:57 [IST]
Other articles published on Jun 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X