
గెలిచి తీరాల్సిన చోట..
రెజ్లింగ్‌లో తనపై ఉన్న ఆశలను నెరవేర్చేలా కనిపిస్తోన్నాడు బజరంగ్ పునియా. స్టార్ రెజ్లర్ హోదాలో ఆయన టోక్యో ఒలింపిక్స్‌లో చేరుకున్నారు. ఆ హోదాను నిలబెట్టుకునేలా అత్యద్భుత ఆటతీరును ప్రదర్శిస్తోన్నారు. ఫామ్‌ను కొనసాగిస్తోన్నారు. టోక్యోలో జరిగిన రెండు రెజ్లింగ్ బౌట్లలోనూ బ్యాక్ అండ్ బ్యాక్ విజయాలను అందుకున్నారు. ఈ రెండింట్లోనూ ఆయన చూపిన పోరాటం.. అసాధారణం. ఏ ఒక్క బౌట్‌లో వెనుకంజ వేసిన పతకంపై కోట్లాది మంది భారతీయుల ఆశలు గల్లంతయ్యేదే. అలాంటి కీలక బౌట్లలో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు బజరంగ్.

తొలుత 1/8 ఫైనల్ రౌండ్‌లో..
తొలుత- పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 1/8 ఫైనల్ రౌండ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఈ బౌట్‌ను ఏకపక్షంగా మార్చివేశారు. కిర్గిజిస్తాన్‌కు చెందిన ఎర్నజార్బఅకమటలియేవ్‌పై తిరుగులేని విజయాన్ని ఆర్జించారు. ఈ విజయంతో ఆయన క్వార్టర్ ఫైనల్స్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. క్వార్టర్ ఫైనల్స్‌లో తన ప్రత్యర్థిని బోల్తా కొట్టించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో ఇరాన్‌కు చెందిన కుస్తీ వీరుడు మోర్తెజా హసన్ అలీ ఛెకా ఘియాసీనీ ఓడించారు. మోర్తెజా ఘియాసీకి ఇదే తొలి ఒలింపిక్స్. అతణ్ని ఓడించి పునియా సెమీ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లారు. మహిళల హాకీ జట్టు చవి చూసిన పరాజయాన్ని మరిపించేలా చేశారాయన.

తొలుత వెనుకంజలో ఉన్నా..
క్వార్టర్ ఫైనల్స్ బౌట్‌లో బజరంగ్ పునియా తొలుత వెనుకంజలో కనిపించారు. తొలి రౌండ్‌ను 0-1 తేడాతో కోల్పోయారు. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఆయనకు రాలేదు. రౌండ్ రౌండ్‌కూ తన ఆధిక్యతను పెంచుకుంటూ పోయారు. మోర్తెజా ఘియాసీని ఒక పాయింట్ వద్దే పరిమితం చేశారు. తన పాయింట్లను నాలుగుకు పెంచుకున్నారు. చివరికి ఈ బౌట్‌ను 4-1 తేడాతో గెలుచుకున్నారు. రెజ్లింగ్‌లో భారత్‌ను సెమీ ఫైనల్స్ వరకూ తీసుకెళ్లారు బజరంగ్. పతకానికి ఇంకొక్క విజయం దూరంలో నిలిచారాయన. ఈ హర్డిల్‌ను బజరంగ్ పునియా అధిగమించాల్సి ఉంది.

ఫైనల్స్‌లో అజర్‌బైజార్ రెజ్లర్‌తో
సెమీ ఫైనల్స్‌లో బజరంగ్ పునియా అజర్‌బైజాన్‌కు చెందిన హాజీ అలియేవ్‌ను ఢీ కొట్టాల్సి ఉంది. సెమీ ఫైనల్స్‌లో గెలిస్తే.. భారత్‌కు మరో పతకం ఖాయమౌతుంది. భారత్ తన పతకాల సంఖ్యను మరింత మెరుగుపర్చుకోగలుగుతుంది. దాన్ని పెంచుకోగలుగుతుంది. దీనికోసం బజరంగ్ పునియా.. సెమీ ఫైనల్స్ గండాన్ని అధిగమించాల్సి ఉంటుంది. హాజీ అలియేవ్.. అల్లాటప్పా రెజ్లర్ కాదు. మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్. 2016లో రియో డి జనేరియోలో నిర్వహించిన ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సైతం ముద్దాడాడతను. 2014, 2015, 2017ల్లో నిర్వహించిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్ విన్నర్. హాజీ అలయేవ్‌ను అధిగమించగలిగితే భారత్‌కు మరో పతకాన్ని అందుకున్నట్టే అవుతుంది.


Click it and Unblock the Notifications












