For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bajrang Punia: కీలక పోరులో ఓడిన స్టార్ రెజ్లర్: తప్పని సెమీస్ గండం: ఇక కాంస్యం కోసం బరిలో

Wrestler Bajrang Punia loses to Haji Aliyev 5-12 in Mens 65kg Freestyle semi-final at Tokyo Games

టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 15వ రోజు భారత్ మరో ఓటమిని చవి చూసింది. సెమీ ఫైనల్స్ గండం నుంచి తప్పించుకోలేకపోయింది. మహిళల హాకీ విభాగంలో భారత జట్టు కాంస్య పతకం కోసం గ్రేట్ బ్రిటన్ చేతిలో పోరాడి ఓడింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితుల్లోనే మరో పరాజయం పలకరించింది. భారత స్టార్ రెజ్లర్ బజరంగి పునియా ఓడిపోయాడు. అతను కూడా సెమీ ఫైనల్స్ గండాన్ని దాటలేకపోయాడు.

పసిడి పతకం కోసం సాగించిన పోరులో చివరి వరకూ నిలిచినా.. ఓటమి కోరల నుంచి బయటపడలేకపోయాడు. పతకం ఆశలను మాత్రం సజీవంగా నిలుపుకోగలిగాడు. కాంస్య పతకం కోసం మరో బౌట్‌ను బజరంగి పునియా ఎదుర్కొనాల్సి ఉంది. పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ సెమీ ఫైనల్ కొద్దిసేపటి కిందటే ముగిసింది. ఇందులో బజరంగి 5-12 స్కోరు తేడాతో తన ప్రత్యర్థి చేతిలో పరాజయాన్ని చవి చూశాడు. అజర్‌బైజాన్‌కు చెందిన హాజీ అలియేవ్‌ చేతిలో ఓడిపోయాడు.

సెమీ ఫైనల్స్‌లో గెలిస్తే.. భారత్‌కు రజతం.. ఫైనల్స్‌లో ప్రతాపాన్ని చూపితే పసిడి పతకం సొంతమౌతుంది. అలాంటి కీలక మ్యాచ్‌లో బజరంగి.. చివరి వరకూ పోరాడాడు. సెమీస్ గండాన్ని గట్టెక్కడానికి ఎక్కడా లేని తెగువను ప్రదర్శించాడు. అయినప్పటికీ.. ఓటమి నుంచి తప్పించుకోలేకపోయాడతను. హాజీ అలియేవ్ 12 పాయింట్లను సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో అతను ఫైనల్స్‌కు చేరాడు. ఈ కేటగిరీలో అజర్‌బైజాన్‌కు రజత పతకం ఖాయమైంది. ఫైనల్స్‌లో అతను విజయం సాధిస్తే.. స్వర్ణ పతకాన్ని అందుకుంటాడు.

హాజీ అలియేవ్.. మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్. 2016లో రియో డి జనేరియోలో నిర్వహించిన ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సైతం ముద్దాడాడతను. 2014, 2015, 2017ల్లో నిర్వహించిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్ విన్నర్. ఈ ఉదయం నుంచి వరుసగా రెండు బౌట్లలో నెగ్గాడు బజరంగి. అదే జోరును సెమీ ఫైనల్స్‌లో ప్రదర్శించలేకపోయాడు. తొలుత- పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 1/8 ఫైనల్ రౌండ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్నాడు.

కిర్గిజిస్తాన్‌కు చెందిన ఎర్నజార్బ్ అకమటలియేవ్‌పై తిరుగులేని విజయాన్ని ఆర్జించాడు. ఈ విజయంతో ఆయన క్వార్టర్ ఫైనల్స్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. క్వార్టర్ ఫైనల్స్‌లో తన ప్రత్యర్థిని బోల్తా కొట్టించారు. ఇరాన్‌కు చెందిన కుస్తీ వీరుడు మోర్తెజా హసన్ అలీ ఛెకా ఘియాసీనీ ఓడించారు. మోర్తెజా ఘియాసీకి ఇదే తొలి ఒలింపిక్స్. అతణ్ని ఓడించి పునియా సెమీ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లాడు. సెమీస్‌లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్టు కనిపించింది. ప్రత్యర్థిపై పైచేయి సాధించడంలో తడబడ్డాడు. ఫలితంగా బౌట్ చేజారింది.

Story first published: Friday, August 6, 2021, 17:01 [IST]
Other articles published on Aug 6, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+