World Wrestling Championships: వివాదాస్పదంగా మారిన భజరంగ్ ఓటమి!

హైదరాబాద్: కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియాకు అన్యాయం జరిగింది. సెమీఫైనల్ బౌట్‌లో భజరంగ్ పూనియా పట్ల అంపైర్లు ఉద్దేశపూర్వకంగానే పునియాను ఓడించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సెమీఫైనల్లో 65 కేజీల విభాగంలో కజకిస్థాన్ ఆటగాడు దౌలత్ నియజ్‌బెకోవ్‌తో భజరంగ్ పోటీపడ్డాడు. ఇద్దరూ అద్భుతంగా పోరాడటంతో మ్యాచ్ ముగిసేటప్పటికి స్కోర్లు 9-9తో సమం అయ్యాయి. అయితే, 'బిగ్గర్ త్రో' ఆధారంగా నియజ్‌బెకోవ్‌ను మ్యాచ్ రిఫరీ విజేతగా ప్రకటించారు.
అంపైర్ల నిర్ణయంపై భజరంగ్ అక్కడే తన అసహనాన్ని ప్రదర్శించాడు. అయినప్పటికీ రిఫరీలు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహంతో భజరంగ్ కోచ్ షేక్ బెనిటిడిస్ కోచ్‌ల బ్లాక్‌ను కాలితో తన్నాడు. భజరంగ్ మెరుగైన త్రోలను పట్టించుకోలేదని, బౌట్‌ను పరిశీలిస్తే తమ రెజ్లర్‌కే అదనంగా రెండు పాయింట్లు వస్తాయని కోచ్ అన్నారు.
అసలేం జరిగింది?
బౌట్‌లో నియజ్‌బెకోవ్‌ను భజరంగ్ తన ఉడుంపట్టుతో బంధించాడు. ఈ క్రమంలో అతడు ఊపిరి తీసుకొనేందుకు ప్రత్యర్థికి రిఫరీ ఎక్కువ సమయం ఇచ్చాడు. కాషన్ కూడా ఇవ్వలేదు. ఈ సమయంలో భజరంగ్‌ను నియజ్‌బెకోవ్ సర్కిల్ వద్దకు నెట్టేశాడు. దీంతో అతడికి రిఫరీ నాలుగు పాయింట్లు ఇచ్చాడు. ఇదే నియజ్‌బెకోవ్‌ను విజేతగా నిలిపింది.
దీనిపై దీనిపై ఇప్పటికే పలువురు విమర్శలు కురిపించగా తాజాగా రెజ్లర్ యోగేశ్వర్ దత్ కూడా మండిపడ్డాడు. "ఎవరైనా భజరంగ్-నియజ్‌బెకోవ్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సెమీస్ మ్యాచ్ చూశారా. అందులో ఎవరిది ఆధిపత్యమో స్పష్టంగా కనబడుతోంది. అసలు అంపైర్లు మీరు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు. మీరు మ్యాచ్‌కు అంపైర్లగా ఉండి ఏమిటి ఉపయోగం. ఒక మెగా టోర్నమెంట్‌లో ఇంతటి పక్షపాతంగా వ్యవహరిస్తారా?" అని మండిపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications