Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్: భారత్ నుంచి సాక్షి, వినేశ్

హైదరాబాద్: వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్‌కు భారత్ నుంచి ఎనిమిది మంది మహిళా రెజ్లర్లు ఎంపికయ్యారు. ప్రాన్స్ రాజధాని పారిస్‌లో ఆగస్టులో జరిగే ఈ పోటీలకు వినేష్ పోగట్, సాక్షి మాలిక్, పూజా ధండా సహా ఎనిమిది మహిళా రెజ్లర్లు ఈ పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించనున్నారు.

భారత రెజ్లింగ్‌ సమాఖ్య లక్నోలో ఆయా విభాగాల్లో ట్రయల్స్‌ నిర్వహించి భారత తరఫున వీరిని ఎంపిక చేసింది. రియో ఒలింపిక్స్‌‌లో కాంస్య పతక విజేత (58 కిలోలు), ఆసియా ఛాంపియన్స్‌షిప్‌లో (60 కిలోలు) రజతం సాధించిన సాక్షి మాలిక్‌ ఈ ఛాంపియన్ షిప్‌కు ఎంపికైంది.

ఇక ఆసియా ఛాంపియన్స్‌షిప్‌లో రజతం కైవసం చేసుకొన్న వినీశ్‌ ఫొగట్‌ 48 కిలోల విభాగంలో బరిలోకి దిగనుంది. శీతల్‌ (53 కిలోలు), లలిత (55 కిలోలు), పూజా దండ (58 కిలోలు), శిల్పి (63 కిలోలు), నవజోత్‌ కౌర్‌ (69 కిలోలు), పూజ (75 కిలోలు) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు.

ఇదిలా ఉంటే గీతా ఫొగట్‌, బబితా ఫొగట్‌‌‌లు లక్నోలో నిర్వహించిన ట్రయల్స్‌లో పాల్గొనలేదు. మరోవైపు రితూ, సంగీత ఫొగట్‌‌లు అర్హత సాధించలేకపోయారు.

ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే మహిళా రెజ్లర్లు:
Vinesh Phogat (48kg), Sheetal (53kg), Lalita (55kg), Pooja Dhanda (58kg), Sakshi Malik (60kg), Shilpi (63kg), Navjot Kaur (69kg), Pooja (75kg).

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+