Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ర‌ష్యాపై వరల్డ్ టైక్వాండో క‌ఠిన ఆంక్ష‌లు.. పుతిన్ టైక్వాండో బ్లాక్ బెల్ట్ కూడా తొల‌గింపు

World Taekwondo removes Russian President Vladimir Putins black belt

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడుల‌ను ప్ర‌పంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్ర‌ఖ్యాత క్రీడా స‌మాఖ్య వరల్డ్ టైక్వాండో కూడా ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడుల‌ను తీవ్రంగా ఖండించింది. ఈ క్ర‌మంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అందించిన‌ గౌరవ టైక్వాండో బ్లాక్ బెల్ట్‌ను కూడా తొల‌గించింది. 2013 నవంబర్‌లో ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రదానం చేసిన గౌరవ 9వ డాన్ బ్లాక్ బెల్ట్‌ను ఉపసంహరించుకోవాలని వరల్డ్ టైక్వాండో నిర్ణయించింద‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా కూడా అధికారికంగా తెలిపింది. అంతేకాకుండా సైనిక దాడుల‌కు పాల్ప‌డుతున్న ర‌ష్యాపై వరల్డ్ టైక్వాండో ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠిన త‌రం చేసింది. రష్యా, బెలారస్‌లో ఎటువంటి టైక్వాండో ఈవెంట్‌లను నిర్వహించ‌బోమ‌ని అధికారికంగా వెల్ల‌డించింది.

ఇప్ప‌టికే ఫుట్‌బాల్ సంస్థలు ఫిపా, UEFA రష్యా జాతీయ జట్టు, క్లబ్‌లను పోటీల నుండి సస్పెండ్ చేశాయి. ఫిఫా నిషేధం త‌ర్వాత వరల్డ్ టైక్వాండో ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా విజయం కంటే శాంతి అత్యంత విలువైనదంటూ టైక్వాండో పేర్కొంది. ప్రపంచ టైక్వాండో ఈ నినాదాన్ని భావిస్తుంద‌ని తెలిపింది. అయితే వ‌ర‌ల్డ్ టైక్వాండ్ విలువలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌లో ర‌ష్యా అమాయకులపై క్రూరమైన దాడులు చేస్తుంద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేసింది. ఈ దాడుల‌ను ప్రపంచ టైక్వాండో తీవ్రంగా ఖండిస్తున్నట్లు క్రీడల పాలకమండలి ఒక ప్రకటనలో పేర్కొంది.

మ‌రోవైపు ఉక్రెయిన్‌లో ర‌ష్యా దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. నేటితో దాడులు ఆరో రోజుకు చేరుకున్నాయి. సోమవారం బెలార‌స్ వేదిక‌గా ఇరు దేశాల విదేశాంగ ప్ర‌తినిధుల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. అయితే ఇరు దేశాలు మ‌రో చ‌ర్చ‌ల కోసం భేటి కానున్నాయి. కానీ ఎప్పుడు భేటీ అవుతాయ‌నే దానిపై ఎటువంటి స‌మాచారం లేదు. మ‌రోవైపు ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడిని ప్ర‌పంచ దేశాలు ఖండిస్తున్నాయి. చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచిస్తున్నాయి. ర‌ష్యా దాడుల‌ను ఇటు ఉక్రెయిన్ సైతం స‌మ‌ర్ధ‌వంతంగా తిప్పికొడుతుంది. ఇప్ప‌టికే 3,500 మంది ర‌ష్యా సైనికుల‌ను అంత‌మొందించిన‌ట్లు ఆ దేశం ప్ర‌క‌టించింది.

Story first published: Tuesday, March 1, 2022, 13:19 [IST]
Other articles published on Mar 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+