Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెన్నై టీమ్ కొత్త జెర్సీ ఇదే.. విడుదల చేసిన హీరోయిన్ సమంత!

మరో రెండు రోజుల్లో వరల్డ్ పికెల్‌ బాల్ లీగ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ లీగ్ లో పాల్గొనే తన జట్టు చెన్నై సూపర్ ఛాంప్స్ కు సంబంధించిన కొత్త జెర్సీని హీరోయిన్ సమంత లాంఛ్ చేసింది.

వరల్డ్‌ పికిల్‌ బాల్‌ లీగ్‌ లో చెన్నై సూపర్ ఛాంప్స్ ఫ్రాంఛైజీని హీరోయిన్ సమంత కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఆ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తోంది. సామ్ కొనుగోలు చేయడంతోనే ఈ గేమ్ ఇక్కడ చాలా మందికి పరిచయమైంది. అయితే తాజాగా ఆమె తన జట్టుకు సంబంధించిన కొత్త జెర్సీని లాంఛ్ చేసింది. చెన్నైలోని సత్యభామ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ లో స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించి ఈ జెర్సీని విడుదల చేసింది. రెడ్, ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఈ జెర్సీని డిజైన్ చేశారు.

World Pickleball League 2025 Heroine Samantha Ruth Prabhu Unveils her Chennai Super Champs Jersey

జెర్సీ లాంఛ్ చేసిన తర్వాత టీమ్ తో కలిసి సెల్ఫీలకు పోజులిస్తూ సందడి చేసింది సమంత. ఈ ఈవెంట్లో సమంత ధగధగ మెరిసిపోతూ కనిపించడంతో.. ఆమె అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈవెంట్ లో సమంత మాట్లాడుతూ.. లీగ్ లో అద్భుతంగా రాణించాలని తమ జట్టుకు ఆల్ ది బెస్ట్ తెలిపింది. పికెల్ బాల్ ఎక్సైటింగ్ స్పోర్ట్ అని చెప్పిన సామ్.. ఫిట్ నెస్, కాంపిటీషన్, ఫన్ పరంగా ప్రజలను దగ్గర చేస్తుందని చెప్పుకొచ్చింది.

జనవరి 24 నుంచి ప్రారంభం కానున్న ఈ వరల్డ్ పికెల్ బాల్ లీగ్ లో చెన్నై సూపర్ ఛాంప్స్ జట్టు తమ మొదటి మ్యాచ్ ను బెంగళూరు జవాన్స్ తో తలపడనుంది. ఈ లీగ్ లో మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగనున్నాయి.

పికిల్ బాల్ గేమ్ అంటే ఇదే

పికిల్‌బాల్ గేమ్ 1965లో అమెరికాలో మొదలైంది. ఇప్పుడిప్పుడే ఈ ఆటకు మన దగ్గరా ఆదరణ దక్కుతోంది. అంతర్జాతీయంగా ఈ గేమ్ లో పెద్ద టోర్నీలే నిర్వహిస్తారు. టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ను పోలి ఉంటుందీ ఈ పికిల్‌బాల్‌ గేమ్‌. ఇండోర్‌ లేదా అవుట్‌డోర్‌లో ఈ గేమ్‌ను ఆడొచ్చు. సింగిల్స్‌లో ఇద్దరు, డబుల్స్‌లో నలుగురు కలిసి ఆడతారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కూడా ఈ గేమ్ ను నిర్వహిస్తుంటారు. ఆటలో హార్డ్‌ ప్లాస్టిక్‌ బాల్, చెక్కతో చేసిన పాడిల్‌ను ఉపయోగిస్తారు.

Story first published: Wednesday, January 22, 2025, 12:46 [IST]
Other articles published on Jan 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+