For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హీరోయిన్ సమంత బాటలో రిషభ్ పంత్!- అందులోకి ఎంట్రీ!!

టీమిండియా స్టార్ క్రికెటర్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అతడు రంజీ ట్రోఫీలో దిల్లీ జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే ఇప్పుడతడు హీరోయిన్ సమంత ఎంట్రీ ఇచ్చిన లీగ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. దాని గురించి తెలుసుకుందాం.

మరో రోజులో (జనవరి 24) వరల్డ్ పికెల్‌ బాల్ లీగ్ (డబ్ల్యూపీబీఎల్‌) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జనవరి 24 నుంచి మొదలు కానుంది. అయితే ఈ లీగ్ లోనే టీమిండియా స్టార్ పంత్ అడుగుపెట్టనున్నాడు. అయితే ఆటగాడిగా మాత్రం కాదు. ఓ ఫ్రాంఛైజీకి సహ యజమానిగా వ్యవహరించనున్నాడు.

World Pickleball League 2025 After Samantha Teamindia cricketer Rishabh Pant joins World Pickleball League as Mumbai team co-owner

ఈ వరల్డ్ పికెల్ బాల్ లీగ్ లో మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగనున్నాయి. చెన్నై సూపర్ ఛాంప్స్ జట్టు తమ మొదటి మ్యాచ్ ను బెంగళూరు జవాన్స్ తో తలపడనుంది. ఈ రెండిటితో పాటు లీగ్ లో ముంబయి జట్టు కూడా ఉంది. ఈ ముంబయి పికిల్‌ పవర్‌ ఫ్రాంఛైజీకే రిషభ్ పంత్ సహ యజమాని కానున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు.

''పికిల్‌బాల్‌పై ప్రజల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. నాకు కూడా ఆ ఆటంటే చాలా ఇష్టం. ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఇందు కోసం ప్రపంచ పికిల్‌ బాల్‌ లీగ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను'' అని పంత్‌ వెల్లడించాడు.

World Pickleball League 2025 After Samantha Teamindia cricketer Rishabh Pant joins World Pickleball League as Mumbai team co-owner

ఇప్పటికే ఈ ప్రపంచ పికిల్‌ బాల్‌ లీగ్‌ లో హీరోయిన్ సమంత కూడా ఎంట్రీ అయిన సంగతి తెలిసిందే. ఆమె చెన్నై సూపర్ ఛాంప్స్ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసింది. రీసెంట్ గానే తన జట్టుకు సంబంధించిన కొత్త జెర్సీని విడుదల చేసింది. రెడ్, ఎల్లో కలర్ కాంబినేషన్ లో డిజైన చేసిన ఆ జెర్సీని క్రీడాభిమానులను ఆకట్టుకుంది.

పికిల్ బాల్ గేమ్ అంటే ఇదే

పికిల్‌బాల్ గేమ్ 1965లో అమెరికాలో మొదలైంది. ఇప్పుడిప్పుడే ఈ ఆటకు మన దగ్గరా ఆదరణ దక్కుతోంది. అంతర్జాతీయంగా ఈ గేమ్ లో పెద్ద టోర్నీలే నిర్వహిస్తారు. టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ను పోలి ఉంటుందీ ఈ పికిల్‌బాల్‌ గేమ్‌. ఇండోర్‌ లేదా అవుట్‌డోర్‌లో ఈ గేమ్‌ను ఆడొచ్చు. సింగిల్స్‌లో ఇద్దరు, డబుల్స్‌లో నలుగురు కలిసి ఆడతారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కూడా ఈ గేమ్ ను నిర్వహిస్తుంటారు. ఆటలో హార్డ్‌ ప్లాస్టిక్‌ బాల్, చెక్కతో చేసిన పాడిల్‌ను ఉపయోగిస్తారు.

Story first published: Thursday, January 23, 2025, 12:34 [IST]
Other articles published on Jan 23, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+