Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దుబాయ్ టోర్నీలో అగ్రస్థానంలో నిలిచిన దీపా మాలిక్

World Para Athletics Grand Prix: Deepa Malik takes Asian top spot

హైదరాబాద్: భారత పారా అథ్లెట్‌ దీపా మాలిక్‌ మరో ఘనత సాధించింది. దుబాయ్‌లో జరుగుతున్న వరల్డ్‌ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రీలో ఆమె కెరీర్‌లో అత్యుత్తమంగా డిస్క్‌ను 8.01 మీటర్ల దూరం విసిరి ఈ ఘనత సాధించింది.

డిస్కస్‌ త్రో ఆసియా ర్యాంకింగ్‌ 53 కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాదు ఆసియా క్రీడల సంయుక్త కేటగిరీలో ఈవెంట్‌ 51/52/ 53లో రెండోస్థానం ద క్కించుకుంది. ఈ అద్భుత ప్రదర్శనతో వచ్చే అక్టోబరులో జకర్తాలో జరిగే ఆసియా పారా గేమ్స్‌కు ఎంపికైంది.

హర్యానాకు చెందిన 47 ఏళ్ల దీపా మాలిక్‌ విజయం అందరికీ స్ఫూర్తినిచ్చేదే. నడుం నుంచి కింది భాగం అచేతనంగా మారడంతో 19 ఏళ్లుగా ఆమె చక్రాల కుర్చీకే పరిమితమైంది. అయినా పట్టుదలతో ఆటల్లో రాణిస్తోంది. 2016లో జరిగిన పారాలింపిక్స్‌లో ఆమె షాట్‌పుట్‌తో పాటు జావెలిన్‌ త్రో, స్విమ్మింగ్‌లో పోటీపడింది. పారాలింపిక్స్‌లో పతకాన్ని గెల్చుకున్న తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది.

వెన్నెముక ట్యూమర్‌తో బాధపడుతున్న ఆమెకు మొత్తం 31 శస్త్ర చికిత్సలు జరిగాయి. నడుము నుంచి కాలి వరకూ జరిగిన ఆపరేషన్స్‌లో 183 కుట్లు పడ్డాయి. మంచానికే పరిమితం కావాల్సిన ఆమె క్రీడాకారిణిగా ఎదగడానికి అవిశ్రాంతంగా కృషి చేసింది. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో శ్రమించింది. షాట్‌పుట్‌లోనేగాక, జావెలిన్‌త్రో, స్విమ్మింగ్ విభాగాల్లోనూ మేటి పారా క్రీడాకారిణిగా గుర్తింపు సంపాదించింది.

Story first published: Thursday, March 15, 2018, 12:31 [IST]
Other articles published on Mar 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+