For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ కప్ పోటీలు ఇండియా ఐర్లాండ్‌కు భయపడక తప్పదా?

By Pratap
William Porterfield-Mahendra Singh Dhoni
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్‌ జట్టుకు భయపడాల్సిందే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండును ఓడించి తీరు చూస్తుంటే భారత జట్టుకు ఐర్లాండ్ నుంచి ప్రమాదం పొంచి ఉందనే భావన వ్యక్తమవుతోంది. ఐర్లాండ్ పటిష్టంగా ఉన్నట్లు, ఏ జట్టుకైనా భయపడే పరిస్థితిలో లేనట్లు అర్థమవుతోంది. ఓడిపోతామనే భయం లేకుండా ఐర్లాండ్ జట్టు మైదానంలోకి అడుగుపెడుతోంది. ఆ దీమానే ఆ జట్టు బలంగా చెప్పవచ్చు. ఏ మాత్రం అవకాశం దక్కినా ప్రత్యర్థి జట్టుకు అది షాక్ ఇవ్వగలదనేది ఇప్పటికే రుజువైంది. ఈ స్థితిలో ఐర్లాండ్‌తో ఆదివారం జరిగే మ్యాచును భారత్ ఆషామాషీగా తీసుకోవడం లేదు.

ఐర్లాండ్ బ్యాటింగ్ పటిష్టంగా ఉందనేది వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లాండు ఉంచి 327 పరుగుల లక్ష్యాన్ని ఏ మాత్రం తడబాటు లేకుండా ఐర్లాండ్ ఛేదించింది. చివరి బ్యాట్స్‌మన్ వరకు పోరాట పటిమను ప్రదర్శించగలదు. ఇంగ్లాండుతో జరిగిన మ్యాచులో నెంబర్ 7 బ్యాట్స్‌మన్ మూడు పరుగులతో అర్థ సెంచరీ మిస్సయ్యాడు. ఆరో నెంబర్ బ్యాట్స్‌మన్ ప్రపంచ కప్‌లోనే అత్యంత వేగమైన సెంచరీని చేశాడు. ఈ పరుగులన్నీ ఫాస్ట్ బౌలర్ల బంతుల్లోనే రావడం విశేషం.

ఫీల్డింగ్ విషయానికి వస్తే ఐర్లాండ్ కన్నా భారత్ బలహీనంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్ భారత్‌కు కష్టాలు సృష్టించవచ్చు. ఈ విషయంలో భారత్ జాగ్రత్త పడక తప్పదు. ఐర్లాండ్ జట్టులోని క్రికెటర్లు కౌంటీ క్రికెట్‌లో అనుభవం సంపాదించినవారు. 2007లో పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చినట్లుగానే, 2011లో ఇంగ్లాండుకు షాక్ ఇచ్చారు. కాగా, రేపు ఐర్లాండ్‌తో ఏడుగురు బ్యాట్స్‌మెన్‌తో మైదానంలోకి దిగుతామని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. తమ ఆటగాళ్లంతా పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నారని ఆయన చెప్పాడు. జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉంటారని కూడా తెలిపాడు. ఈ స్థితిలో పియూష్ చావ్లా స్థానంలో అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+