కివీస్‌ను ఉతికి ఆరేసిన భారత్, కెప్టెన్ ధోనీ తడాఖాతో విజయం

తనలో దూకుడు తగ్గలేదని ధోనీ చాటి చెప్పాడు. కసితీరా బంతిని బాదుతూ అభిమానులకు వినోదాన్ని పంచాడు. నిజానికి 34 ఓవర్లు ముగిసే సరికి స్కోరు ఎక్కువగా ఏమీలేదు. 167/3. రన్‌రేట్ ఐదు లోపే. 35వ ఓవర్లో పవర్ ప్లే తీసుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారింది. గంభీర్ బౌండరీల మీద బౌండరీలు బాదాడు. సౌథీ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. పవర్ ప్లేలో ఆడిన 12 బంతుల్లోనే 31 పరుగులు రాబట్టిన గంభీర్.. సౌథీ బౌలింగ్‌లో నిష్క్రమించడంతో 68 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అయినా కివీస్‌కు ఎలాంటి ఊరట లభించలేదు. అప్పటిదాకా గంభీర్‌కు సహకరించిన ధోనీ, అతని ఔట్ తర్వాత రెచ్చిపోయాడు. కివీస్ బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. మైదానం అన్నివైపులా ఎడాపెడా భారీ షాట్లు కొట్టాడు. 40 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసిన ధోనీ ఓరమ్ వేసిన ఓ ఓవర్లో వరుసగా ఐదు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత నాథన్ మెక్‌కలమ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టాడు. వికెట్ల మధ్య కూడా వేగంగా పరుగెత్తాడు. కేవలం 61 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు రైనా కూడా టీ20 క్రికెట్‌ను తలపించాడు. ఇటీవల పెద్దగా ఫామ్‌లోలేని రైనా కివీస్ బౌలింగ్‌ను ఆటాడుకున్నాడు. భారీ షాట్లతో కేవలం 25 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ఓరమ్ వేసిన ఇన్నింగ్స్ 45వ ఓవర్లో మిడ్‌వికెట్ మీదుగా మూడు సిక్సర్లు కొట్టాడు. 48వ ఓవర్ చివరి బంతికి అతడు ఔట్ కావడంతో ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ధోనీ, రైనా కేవలం 56 బంతుల్లో 124 పరుగులు జోడించడం విశేషం.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ అంత స్కోరు చేస్తుందని మొదట ఎవరూ ఊహించలేదు. 10 ఓవర్లలో 42 పరుగులకే ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్‌ల వికెట్లు కోల్పోయింది. గంభీర్, కోహ్లి బాధ్యతాయుతంగా ఆడారు. పరిస్థితిని చక్కదిద్దారు. కోహ్లి సింగిల్స్ తీస్తూ, అప్పుడప్పుడు బంతిని బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. 55 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. గంభీర్, కోహ్లి 115 బంతుల్లోనే 100 భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు. ఐతే కొద్దిసేపటికే కోహ్లి.. ఓరమ్ ఆఫ్‌స్టంప్ ఆవల వేసిన బంతిని వెంటాడి ఔటయ్యాడు.
మన స్పిన్నర్ల మాయాజాలం మరోసారి పనిచేసింది. న్యూజిలాండ్‌కు కళ్లెం వేశారు. లక్ష్యానికి దగ్గరగా కూడా రానివ్వలేదు. భారీ లక్ష్యఛేదనను కివీస్ మెరుగ్గానే ఆరంభించింది. గప్తిల్ (38), బ్రెండన్ మెక్‌కలమ్ (58) పేసర్లను సమర్థంగా ఎదుర్కోవడంతో 15 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 94 పరుగులు చేసింది. ఆ దశలో అశ్విన్ ఓ చక్కని బంతితో గప్తిల్‌ను ఔట్ చేసి జట్టుకు తొలి వికెట్‌ను అందించాడు. కొద్దిసేపటికే మెక్‌కలమ్ రనౌటయ్యాడు. ఆ తర్వాత హర్భజన్ (2/17), పియూష్ చావ్లా (2/39), యువరాజ్ (2/33) ధాటికి కివీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. చివరి రెండు వికెట్లు నెహ్రా పడగొట్టాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (బి) ఓరమ్ 23; సచిన్ (బి) సౌథీ 17; గంభీర్ (సి) హో (బి) సౌథీ 89; విరాట్ కోహ్లి (సి) బ్రెండన్ మెక్‌కలమ్ (బి) ఓరమ్ 59; ధోనీ నాటౌట్ 108; రైనా (సి) టేలర్ (బి) మిల్స్ 50; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (50 ఓవర్లలో 5 వికెట్లకు) 360; వికెట్ల పతనం: 1-35, 2-42, 3-148, 4-216, 5-340
బౌలింగ్: మిల్స్ 10-1-81-1; సౌథీ 10-1-67-2; ఓరమ్ 9-1-70-2; ఫ్రాంక్లిన్ 2-0-17-0; నాథన్ మెక్‌కలమ్ 10-0-61-0; వుడ్‌కాక్ 5-0-31-0; స్త్టెరిస్ 4-0-29-0
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్తిల్ (సి) ధోనీ (బి) అశ్విన్ 38; బ్రెండన్ మెక్‌కలమ్ రనౌట్ 58; రైడర్ (సి) యువరాజ్ (బి) హర్భజన్ 32; టేలర్ (సి) కోహ్లి (బి) హర్భజన్ 5; ఫ్రాంక్లిన్ (ఎల్బీ) (బి) చావ్లా 0; స్త్టెరిస్ (బి) చావ్లా 20; హో (సి) మునాఫ్ (బి) యువరాజ్ 15; ఓరమ్ (స్టంప్డ్) ధోనీ (బి) యువరాజ్ 12; నాథన్ మెక్‌కలమ్ నాటౌట్ 29; వుడ్‌కాక్ (బి) నెహ్రా 9; మిల్స్ (బి) నెహ్రా 2; ఎక్స్‌ట్రాలు 23 మొత్తం: (43.1 ఓవర్లలో ఆలౌట్) 243; వికెట్ల పతనం: 1-94, 2-118, 3-140, 4-141, 5-147, 6-173, 7-197, 8-202, 9-213
బౌలింగ్: నెహ్రా 7.1-0-55-2; శ్రీశాంత్ 5-0-38-0; మునాఫ్ పటేల్ 3-0-19-0; అశ్విన్ 7-0-30-1; యువరాజ్ 9-0-33-2; హర్భజన్ 4-0-17-2; చావ్లా 8-0-39-2
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications