శ్రీశాంత్‌కు మొండిచేయి, పియూష్ చావ్లాకు చాన్స్: ధోనీ ఆలోచన

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో శ్రీశాంత్ ఆట తీరు అసంతృప్తి కలిగించినట్లు చెబుతున్నారు. ఇంగ్లండుతో జరిగే మ్యాచులో అతను ఆడే అవకాశాలు తక్కువే. అతని స్థానంలో స్పిన్నర్ పియూష్ చావ్లాను ఆడించే అవకాశాలున్నాయి. అంటే, భారత జట్టు ఇద్దరు ఫుల్ టైమ్ స్పిన్నర్లతో భారత జట్టు మైదానంలోకి దిగే అవకాశాలున్నాయి. ఈ మార్పుపై కెప్టెన్ ధోనీ ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. చిన్నస్వామి స్టేడియంలో ఫిబ్రవరి 13వ తేదీన ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచులో చావ్లా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆస్టేలియాపై భారత విజయానికి అతనే కారకుడయ్యాడు. అందువల్ల శ్రీశాంత్ స్థానంలో చావ్లాను తీసుకునే అవకశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, రెండు వారాల క్రితం చావ్లాకు సహకరించిన చిన్న స్వామి స్టేడియం వచ్చే ఆదివారం సహకరిస్తుందా అనేది చూడాల్సి ఉంది.
నెట్‌లో చావ్లా ప్రధానంగా కనిపించడాన్ని బట్టి చూస్తే అతను ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరో విషయం కూడా చావ్లాకు కలిసి వస్తోంది. స్పిన్‌ను ఎదుర్కోవడంలో అస్ట్రేలియన్ల కన్నా ఇంగ్లండు బ్యాట్స్‌మెన్ బలహీనులు. స్పన్ ఎదుర్కోవడంలో ఇంగ్లండు బ్యాట్స్‌మెన్ బలహీనతలను దృష్టిలో పెట్టుకుని కూడా ధోనీ చావ్లాకు అవకాశం కల్పించే అవకాశం ఉంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications