For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గొంతు కోసుకున్నట్లు శామ్యూల్స్ సైగ: ప్రాక్టీస్‌కు గేల్ దూరం

By Pratap

సిడ్నీ: వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ శామ్యూల్స్ బతికిపోయాడు. ఆటగాళ్లకు నిర్దేశించిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా సైగలు చేసినా అతను శిక్ష నుంచి తప్పించుకున్నాడు. జరిమాను నుంచి తప్పించుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచులో సెంచరీ చేసిన ఆనందాన్ని పట్లలేక శామ్యూల్స్ తను గొంతుక కోసుకున్నట్లుగా కుత్తికపై బొటన వేలును అటూ ఇటూ తిప్పాడు. శామ్యూల్స్ చర్యలపై మ్యాచ్ రిఫరీ వెస్టిండీస్ యాజమాన్యం వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్ నేపథ్యంలో గురువారం కరీబియన్ల నెట్‌ ప్రాక్టీస్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ గేల్ కనిపించలేదు. గేల్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని, అయినా శుక్రవారం మ్యాచ్‌లో అతను ఆడతాడని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ తెలిపాడు.

World Cup: Shamuels not fined for his action

అయితే, 35 ఏళ్ల గేల్‌ను సుమారు ఏడాది కాలంగా వెన్నునొప్పి వేధిస్తున్నది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో అతనే వెల్లడించాడు. క్రమం తప్పకుండా ఫిజియోథెరపిస్టు నుంచి చికిత్స పొందుతున్నా, మసాజ్ చేయించుకుంటున్నా సమస్యకు తెరపడలేదని అంటున్నాడు.

ప్రాక్టీస్ సెషన్‌కు గేల్ మిస్సయ్యాడు కదా అని దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్‌కు గుర్తుచేస్తే అతను బిగ్గరగా నవ్వేశాడు."ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుకు అతనితో కలిసి ఆడాను కదా.. ఆ అనుభవంతో చెబుతున్నా. గేల్ నెట్స్‌కు ఎప్పుడూ దూరమే. అతని వయసుతో పోలిస్తే, శరీరానికి ముసలితనం వచ్చేసిందేమో. నా మాదిరే అతనూ వెన్నుగాయంతో బాధపడుతున్నాడు. నిజాయితీగా చెబుతున్నా.. అది తగ్గే గాయం మాత్రం కాదు" అని డివిలియర్స్ అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+