Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచ కప్ రికార్డు: ఒకే ఇన్నింగ్స్‌లో 4 గోల్డెన్ డకౌట్స్

డ్యునెదిన్: మూడు రోజుల క్రితం ప్రారంభమైన ప్రపంచ కప్ టోర్నీలో తొలి ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 5సార్లు 300 కంటే ఎక్కువగా పరుగులు నమోదయ్యాయి. కాగా, డ్యునెదిన్ యువివర్సిటీ ఓవల్‌లో మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో 300 స్కోరులో సగం మాత్రమే చేసి పరాజయం మూటకట్టుకుంది స్కాట్లాండ్.

నలుగురు స్కాట్లాండ్ ఆటగాళ్లు మినహా ఏ ఒక్కరూ కూడా రెండెంకెల స్కోరు నమోదు చేయలేదు. 36.2 ఓవర్లకు ఆలౌట్ అయిన స్కాట్లాండ్ 142 పరుగులు చేసింది. కాగా, ఐదుగురు బ్యాట్స్‌మెన్ పరుగులేమి చేయకుండానే వెనుదిరగడం గమనార్హం. 4గురు ఆటగాళ్లు గోల్డెన్ డకౌట్(ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ కావడం) అయి ఓ ప్రపంచ కప్ రికార్డు నమోదు చేశారు. 1999లో శ్రీలంక, 2003లో పాకిస్థాన్ జట్లు మాత్రమే ఈ విధంగా వన్డేల్లో డకౌట్లు నమోదు చేశాయి.

మంగళవారం నాటి మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ ప్రారంభించిన స్కాట్లాండ్.. న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొవడంలో తీవ్రంగా తడబడింది. 4.2 ఓవర్లకే 12 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయింది. ఇద్దరు బౌలర్లు వరుసగా రెండేసి వికెట్లు తీసుకోవడం గమనార్హం.

World Cup record: 4 golden ducks in 1 innings at Dunedin

రెండో ఓవర్‌లో ట్రెంట్ బోల్ట్ తొలిబంతికే.. కలమ్ మెక్ లియోడ్‌ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు. రెండో బంతికి హమీష్ గార్డినర్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో వాళ్లిద్దరూ కూడా పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరారు. వరుస రెండు బంతుల్లో ఇద్దరు డకౌట్ అయ్యారు.

ఐదో ఓవర్ వేసిన టిమ్ సౌథీ కూడా అలాగే చేశాడు. కైల్ సియోట్జర్(1), ప్రెస్టన్ మోమ్సెన్(0) వరుస బంతుల్లో వెనక్కి పంపాడు. ఆ తర్వాత డెనియల్ వెట్టోరీ బౌలింగ్‌లో ఇయాన్ వార్డ్లా డకౌట్ అయ్యాడు. రెండు బంతులెదుర్కొన్న మాజీద్ హక్ కూడా పరుగులేమి చేయకుండానే వెట్టోరి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో 142 పరుగులకు స్కాట్లాండ్ అలౌటైంది.

స్వల్ప స్కోరు నమోదు చేసినప్పటికీ న్యూజిలాండ్ జట్టును కట్టడి చేసేందుకు స్కాట్లాండ్ తీవ్రంగానే ప్రయత్నించింది. ఏడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ చివరకు 146 పరుగులు చేసి స్కాట్లాండ్‌పై విజయం సాధించింది.

స్కాట్లాండ్ 4 గోల్డెన్ డక్స్

1. కలమ్ మెక్ లియోడ్ ఎల్బీడబ్ల్యూ బౌలింగ్ ట్రెంట్ బోల్డ్ 0పరుగులు (1బంతి)
2. హమీష్ గార్డినర్ ఎల్బీడబ్ల్యూ బౌలింగ్ బోల్ట్ 0 (1)
3. ప్రెస్టన్ మోమ్సెన్ ఎల్బీడబ్ల్యూ టిమ్ సౌథీ 0 (1)
4. ఇయన్ వార్డ్లా ఎల్బీడబ్ల్యూ బౌలింగ్ డేనియల్ వెట్టోరి 0(1)

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+